newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ అరెస్ట్.. కాంగ్రెస్ లో కొరవడిన సహకారం!

07-03-202007-03-2020 12:06:34 IST
2020-03-07T06:36:34.540Z07-03-2020 2020-03-07T06:36:31.768Z - - 12-04-2021

రేవంత్  అరెస్ట్.. కాంగ్రెస్ లో కొరవడిన సహకారం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి సొంత కాంగ్రెస్ పార్టీలోనే సహకారం కొరవైందా? అంటే అవుననే చెప్పాలి. రేవంత్ ప్రస్తుతం అధికార పార్టీపైనా.. ప్రభుత్వంపైనా పోరాటమే చేస్తున్నారు. అది మంచి.. చెడు అన్నది తేల్చాల్సింది ప్రజలే కాగా ప్రస్తుతానికి అయితే ప్రభుత్వాన్ని ఢీ కొట్టే ప్రయత్నమే చేస్తున్నారు.

అయితే ఇంత చేస్తున్నా రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే అండ కోరవైనట్లుగా కనిపిస్తుంది. సాధారణంగానే కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరు.. గ్రూపు రాజకీయాలన్న పేరుంది. దానికి తోడు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉండగా ఆ పదవి కోసం పార్టీలో ఆశావహుల జాబితా చాలా పెద్దగా ఉంది.

వారిలో ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఒకరు కావడంతో ఒకరిపై మరొకరు పొసగని పరిస్థితి. గతంలో ఎన్నికల సమయం సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డికి విభేదాలు కూడా బయటపడినా అప్పటికి సమసిపోయింది. అయితే.. ప్రస్తుతం రేవంత్ రిమాండ్ లో ఉన్నా సొంతపార్టీ నుండి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని చెప్పుకోవాల్సి వస్తుంది.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. 111 జీవో ప్రకారం నిషేదిత ప్రాంతంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించిన కేసులో అయనతో పాటు అయన సోదరులు.. మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించి జైలుకి తరలించారు. ఇదంతా మూడు రోజుల నాటి కథ.

రేవంత్ రిమాండ్ ను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడిక్కడ పార్టీ శ్రేణులతో నిరసనలు, ఆందోలనలకు దిగి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అసలే ఇది ఫామ్ హౌస్ వ్యవహారం కనుక రేవంత్ అరెస్టును హైలెట్ చేస్తే ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశమే ఎక్కువ. అయినా కాంగ్రెస్ పార్టీ అందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు.

శుక్రవారం కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలు.. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు, ద్వితీయ స్థాయి నాయకులు నిరసనలు చేశారు కానీ.. పేరున్న బడా బడా నేతలు మొహం చాటేశారు. కొందరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ అరెస్టును ఖండించగా మరికొందరు ప్రకటనలో రూపంలో ఖండించారు. అంతకు మించి చేసింది సున్నా.

మేధావులు, విద్యావంతులు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులపై తమ గళాన్ని విప్పాలన్నారు.  గురువారం సాయంత్రం రేవంత్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

అందునా పీసీసీ పదవిని ఆశించే నేతలైతే మీడియా ముందుకొచ్చినా రేవంత్ వ్యవహారాన్ని వదిలేసి మిగతా పార్టీ వ్యవహారాలపై.. రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడడం విశేషం. ఒకపక్క అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షాలను కూకట్టివేళ్లతో పెకలించాలని ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇలా పొత్తులుపోని వ్యవహారాలతో కాలం గడపడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle