newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

రేవంత్ అడ్డాలో హరీష్ వ్యూహం.. రిజల్ట్ రిపీట్ అయ్యేనా?

10-01-202010-01-2020 15:32:25 IST
Updated On 10-01-2020 15:38:41 ISTUpdated On 10-01-20202020-01-10T10:02:25.391Z10-01-2020 2020-01-10T10:02:13.163Z - 2020-01-10T10:08:41.547Z - 10-01-2020

రేవంత్ అడ్డాలో హరీష్ వ్యూహం.. రిజల్ట్ రిపీట్ అయ్యేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ వర్సెస్ కేసీఆర్ అండ్ కో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కేసీఆర్ వర్గం మీద సూటి ప్రశ్నలు.. ఇరుకున పెట్టె సన్నాహాలతో విరుచుకుపడడం రేవంత్ నిత్యకృత్యం. తోలుత రేవంత్ టీడీపీ నుండే మొదలైన ఈ విమర్శల పరంపర రేవంత్ పార్టీలు మారి హోదాలు మారుతున్నా టార్గెట్ మాత్రం మారలేదు.

కెసిఆర్ ఉద్యమం సమయం నుంఢి గత ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాల వరకు అమలుకానీ వాటిపై రేవంత్ మీడియా సాక్షిగా విమర్శల బాణాలు సంధించడంలో ఆరితేరిపోయారు. ఇక కెసిఆర్ రేవంత్ కి సూటిగా ఓటుకి నోటులో ముప్పతిప్పలు పెట్టిన సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకవిధంగా ఇది రాజకీయాలను మించి శత్రుత్వంగా మారింది.

ముందుగా రేవంత్ ని రాజకీయం దెబ్బకొట్టేందుకు గత తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెరాస పార్టీ గట్టి వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఆ మాటకొస్తే గత ఐదేళ్ల తెరాస ప్రభుత్వంలో రేవంత్ నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసి ప్రజలను ఆకర్షిచే ప్రయత్నం చేసింది. అనంతరం ఎన్నికలలో కూడా డబ్బు.. రేవంత్ అరెస్టు, ఏకంగా ముగ్గురు మంత్రులు అక్కడే పాగా వేయడంతో చివరికి రేవంత్ ఓటమి చూడాల్సి వచ్చింది.

అయితే ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలిచారు. కాగా అప్పుడు టార్గెట్ రేవంత్ ఆపరేషన్ కి తెరాస పార్టీ ముఖ్య నేత.. మంత్రి, సీఎం కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు నాయకత్వం వహించారని తెలంగాణ రాజకీయ వర్గాలలో అందరికీ తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి రేవంత్ అడ్డాలో మంత్రి హరీష్ రావు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని వినిపిస్తుంది.

నిజాంనికి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి కంచుకోట. కానీ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస రచించిన వ్యూహాలు ఆ కోటను బద్దలు కొట్టాయి. అయితే అంతమాత్రాన అక్కడ తెరాస పాగా వేసినట్లు కాదని అక్కడ వినిపించే మాట. అది నిజం కాదని నిరూపించుకోడానికి రెండు వర్గాలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

మరోసారి తన కోటలో హవా చాటుకోవాలని రేవంత్ రెడ్డి ఆరాటపడుతుంటే.. ఈ ఎన్నికలతో కొడంగల్ గులాబీకి పెట్టని కంచుకోటగా మార్చుకోవాలని తెరాస ఆశపడుతోంది. ఈ క్రమంలోనే హరీష్ వర్గం మరోసారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ఎన్నికలలో హరీష్ వ్యూహం ఫలించి రిజల్ట్ రిపీట్ అవుతుందా? లేక రేవంత్ ఈసారి గులాబీ వ్యూహాలను ఛేదిస్తారా? అన్నది ఫలితాలే తేల్చనున్నాయి!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle