newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

రేవంత్‌ను జైలు గోడలకు పరిమితం చేసే కుట్ర?

12-03-202012-03-2020 12:20:15 IST
2020-03-12T06:50:15.833Z12-03-2020 2020-03-12T06:50:11.486Z - - 26-05-2020

రేవంత్‌ను జైలు గోడలకు పరిమితం చేసే కుట్ర?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని జైలు గోడలకు పరిమితం చేసే కుట్ర జరుగుతుందా? రాష్ట్ర పోలీసులను వెనుక నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తూ అయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటుందా? రేవంత్ జైలుకే పరిమితమైతే టీఆర్ఎస్ పార్టీకి వచ్చే మేలేంటి? రేవంత్ జైలుకే పరిమితం కావాలని సొంత పార్టీలో కూడా కొందరు బలంగా కోరుకుంటున్నారా? అనే చర్చలు రాష్ట్ర రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతున్నాయి.

రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ స్థానంలో కొనసాగుతున్న కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలను ఎగురవేశారని జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ కేసులో అయనతో పాటు కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి ప్రయత్నించిన మిగతా ఐదుగురికి బెయిల్ దక్కినా రేవంత్ రెడ్డికి మాత్రం బెయిల్ దక్కలేదు.

గత రెండు రోజులుగా బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడుతూ వచ్చినా బుధవారం కూకట్ పల్లి కోర్టు పిటిషన్ కొట్టేసింది. మరి డ్రోన్ ఎగరవేసిన కేసుకే బెయిల్ కూడా దక్కని కేసులు మన భారతదేశంలో ఉన్నాయా? బెయిల్ కూడా దొరకని పెద్ద నేరం రేవంత్ రెడ్డి చేసారా? అనే విశ్లేషణలు సహజంగానే జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ప్రభావితం చేస్తూ బెయిల్ దక్కకుండా చేస్తున్నారని రాజకీయ వర్గాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

మంగళవారం రేవంత్‌ రెడ్డికి కూడా బెయిల్‌ వస్తుందని అంతా అనుకుంటుండగా పోలీసులు కొత్త కేసును తెరపైకి తెచ్చారు. గతంలో రేవంత్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు. కానీ రేవంత్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి వల చేధించుకొని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. దీంతో జూబ్లిహిల్స్ పోలీసులు రేవంత్‌పై కేసు నమోదు చేశారు.

ఆ కేసుతో పాటు గతంలో ఉన్న కొడంగల్ ఎన్నికల కేసు, రేవంత్‌ రెడ్డి టీడీపీలో ఉండగా నమోదైన కలెక్టరేట్ల ముట్టడి కేసుతో పాటు అయనపై ఉన్న చిన్నాచితకా మొత్తం యాభై కేసులను తెరమీదకి తెచ్చి పీటీ వారెంట్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. రేవంత్ తరపు లాయర్ ముందస్తు ఎలాంటి నోటీసుకు లేకుండా పీటీ ఎలా ఇస్తారని వాదించడంతో మంగళవారం వాయిదా పడి బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.

అయితే, బుధవారం ప్రస్తుతానికి కోర్టు పోలీసులకు అయన రిమాండ్ అవసరమని భావించి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. అయితే, రేవంత్ బయటకు వస్తే ప్రభుత్వానికి ప్రమాదమని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా? మరోవైపు సొంత పార్టీలో కూడా అయన జైలుకే పరిమితం కావాలని కొందరు బలంగా కోరుకుంటున్నారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు అనిపిస్తుంది.

కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి జరిగి వారం గడుస్తున్నా.. దానిపై ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ స్పందించనేలేదు. రేవంత్ ఆరోపించినట్లుగా ఫామ్ హౌస్ అక్రమ కట్టడమా? సక్రమ కట్టడమా? ఒకవేళ అక్రమం అయితే కేటీఆర్ ఎలా లీజుకు తీసుకున్నారు? అసలు ఎప్పుడు లీజుకు తీసుకున్నారు? అన్న అనుమానాలపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రేవంత్ ఇప్పుడు బయటకి వస్తే దీనిపై పోరాటం ఉదృతం చేయడం గ్యారంటీ కావడంతో అది టీఆర్ఎస్ పార్టీకి మరింత ఇబ్బందిగా మారనుంది.

మరోవైపు టిపిసిసికి రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ గా ఎన్నిక కానున్నారని గత కొంత కాలంగా విస్తృత ప్రచారం జరుగుతుంది. రేవంత్ ఎన్నికను అడ్డుకొనేందుకు సొంతపార్టీలో కొందరు నేతలు కూడా టీఆర్ఎస్ పెద్దలతో కలిసి కుట్రలు చేస్తున్నారా? అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి లాంటివాళ్లు రేవంత్ ఫామ్ హౌస్ ముట్టడి అయన సొంత విషయం మాత్రమేనని స్పష్టం చేశారు.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle