newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్‌కు షాక్‌.. మున్సిపోల్స్‌లో కోమ‌టిరెడ్డి పాస్‌..!

26-01-202026-01-2020 11:05:34 IST
Updated On 27-01-2020 15:17:32 ISTUpdated On 27-01-20202020-01-26T05:35:34.898Z26-01-2020 2020-01-26T05:35:16.345Z - 2020-01-27T09:47:32.044Z - 27-01-2020

 రేవంత్‌కు షాక్‌.. మున్సిపోల్స్‌లో కోమ‌టిరెడ్డి పాస్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దిగిపోవ‌డం ఖాయ‌మైంది. త్వ‌ర‌లోనే కొత్త పీసీసీ చీఫ్‌ను నియ‌మించ‌నుది అదిష్ఠానం. ఈ ప‌ద‌వి కోసం తెలంగాణ కాంగ్రెస్‌లో సుమారు ప‌ది మంది నేత‌లు పోటీ ప‌డుతున్నారు. అధిష్ఠానం కూడా అంద‌రి పేర్ల‌ను, వారి బ‌లాబ‌లాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్నా నాయ‌క‌త్వ లోపంతోనే పార్టీ న‌ష్ట‌పోతోంద‌ని పార్టీ గుర్తించింది. దీంతో ఈసారి పీసీసీ చీఫ్‌గా నియ‌మించేందుకు స‌మ‌ర్థుడిని వెతుకుతోంది.

పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం ఎమ్మెల్యేలు శ్రీధ‌ర్ బాబు, జ‌గ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి పేర్ల‌ను అధిష్ఠానం ప‌రిశీలిస్తోంది. వీరితో పాటు వి.హ‌నుమంత‌రావు, చిన్నారెడ్డి, సంప‌త్‌కుమార్, దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ వంటి నేత‌లు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాగా, రేసులో మాత్రం ప్ర‌ధానంగా ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రూ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా వెంట‌నే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి బ‌లం నిరూపించుకున్నారు.

పీసీసీ అధ్య‌క్షుడి ఎంపికకు క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న క్ర‌మంలో వ‌చ్చిన మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఆశావ‌హుల‌కు కీల‌కంగా మారాయి. మున్సిపోల్స్‌లో స‌త్తా చాటి త‌మ బ‌లం నిరూపించుకొని పీసీసీ పీఠాన్ని అందుకోవాల‌ని నేత‌లు భావించారు. అందుకే పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా ఉన్నా రేవంత్ రెడ్డి కేవ‌లం త‌న మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు పరిధికి, కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కూడా కేవ‌లం భువ‌న‌గిరి పార్ల‌మెంటు ప‌రిధికి, న‌ల్గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌చారం చేశారు.

మున్సిప‌ల్ ఎన్నికల‌ను రేవంత్ రెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నా ఫ‌లితాలు మాత్రం ఆయ‌న‌కు షాక్ ఇచ్చాయి. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోని మొత్తం నాలుగు కార్పొరేష‌న్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఒక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేష‌న్‌లో కాంగ్రెస్‌ను ఆయ‌న గెలిపించ‌లేక‌పోయారు. విస్తృతంగా ప్ర‌చారం చేసినా, శ‌క్తియుక్తుల‌న్నీ ఒడ్డినా రేవంత్‌కు చేదు ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ రెబెల్స్‌కు కాంగ్రెస్ కండువా క‌ప్ప‌డం, మ‌ళ్లీ సాయంత్రానికే వారు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవ‌డం వంటివి కూడా కాంగ్రెస్‌కు న‌ష్టం చేశాయి. రేవంత్ స్వంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లోనూ రెండు మున్సిపాలిటీలు టీఆర్ఎస్‌కే వెళ్లాయి.

కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు అంద‌రికంటే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి మున్సిప‌ల్ ఎన్నిక‌లు కొంత ఊర‌ట‌ను ఇచ్చాయి. ఆయ‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో పాస్ మార్కులు ప‌డ్డాయ‌ని చెప్పుకోవ‌చ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచిన ఏడు మున్సిపాలిటీల్లో నాలుగు భువ‌న‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోనివే.

చండూరు, తుర్క‌యంజాల్‌, పెద్ద అంబ‌ర్‌పేట్, ఆదిభ‌ట్ల మున్సిపాలిటీల‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. యాద‌గిరిగుట్ట‌, భువ‌న‌గిరి, చౌటుప్ప‌ల్ మున్సిప‌ల్ పీఠాల‌నూ కాంగ్రెస్ గెలుచుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, వెంక‌ట్‌రెడ్డి స్వంత నియోజ‌క‌వ‌ర్గం న‌ల్గొండ‌లోనూ టీఆర్ఎస్‌కు స‌మానంగా కాంగ్రెస్‌కు సీట్లోచ్చాయి. మొత్తంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఒక్క భువ‌న‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలో మాత్ర‌మే కాంగ్రెస్ ప‌రువు నిల‌బ‌డింది.

మొత్తంగా పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ముందున్న నేప‌థ్యంలో మున్సిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రేవంత్‌రెడ్డికి మైన‌స్‌గా మారాయి. ఇదే స‌మ‌యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మెరుగైన ఫ‌లితాలు సాధించి త‌న బ‌లం నిరూపించుకున్నారు. ఒక‌వేళ ఈ ఫ‌లితాల‌ను క‌నుక పీసీసీ ఎంపిక‌లో పార్టీ ప‌రిగ‌ణలోకి తీసుకుంటే వెంక‌ట్‌రెడ్డికి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle