newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్‌కు లైన్ క్లియరేనా? రాహుల్ ఆశీస్సులు వున్నట్టేనా?

16-03-202016-03-2020 08:03:44 IST
Updated On 16-03-2020 15:20:35 ISTUpdated On 16-03-20202020-03-16T02:33:44.789Z16-03-2020 2020-03-16T02:31:53.932Z - 2020-03-16T09:50:35.650Z - 16-03-2020

రేవంత్‌కు లైన్ క్లియరేనా? రాహుల్ ఆశీస్సులు వున్నట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక వైపు.. మిగిలిన నేతలు మరోవైపు ఉండిపోయారు. డ్రోన్ కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి రాకపోవచ్చని ప్రచారం మొదలెట్టారు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు. అయితే, రేవంత్ రెడ్డి దూకుడే కాంగ్రెస్ పార్టీకి కావాలని చాలామంది భావిస్తున్నారు. టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించే రోజు వచ్చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని 10 జన్ పథ్ వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో జైలులో ఉండటంతో.. ప్రకటన ఆలస్యం కావచ్చని, పదవి రావడం పక్కా అంటున్నారు. రేవంత్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ప్రకటన ఉంటుందని.. ఇప్పటికే.. టీ కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్యులకు సమాచారం అందింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా.. డీకే శివకుమార్‌ను ప్రకటించారు. అలాగే ఢిల్లీకి అనిల్ చౌదరి అనే నేతను పీసీసీ ప్రెసిడెంట్‌ను చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డి కి పీసీసీ పదవి ఇస్తూ ప్రకటన చేయాల్సి ఉంది. కానీ.. ఆయన జైల్లో ఉండటంతో పెండింగ్‌లో పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. పీసీసీ ప్రకటన సిద్ధం అయ్యే వేళ కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచన చేసేందుకే.. కొంత మంది కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి సమాచారం ఇచ్చి మరీ ఈ పొలిటికల్ గేమ్ ఆడారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.

సల్మాన్ ఖుర్షిద్ నేతృత్వంలో ఓ ప్రత్యేక లాయర్ల బృందాన్నే పంపింది. ఇప్పటికే రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులే పడుతున్నాయి. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రేవంత్ కదలికలను రాహుల్ తన వేగులద్వారా పరిశీలిస్తున్నారు. గాంధీభవన్లో ఇతర కాంగ్రెస్ నేతలు తీరుని కూడా రాహుల్ పరిశీలించారని, నివేదికలు కూడా ఆయనకు అందాయని అంటున్నారు.

ప్రస్తుతం రేవంత్‌ ఒంటరి అయిపోయారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్.. రేవంత్ అరెస్టును కనీసం ఖండించలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తానే పీసీసీ చీఫ్‌ అనుకుంటున్నారు. వీహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు.. రేవంత్ కి పగ్గాలిస్తే కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుందని ఫీలవుతున్నారు.  అయితే, సీనియర్ల కన్నా.. పార్టీ క్యాడర్‌లో మాత్రం.. రేవంత్ పై సదభిప్రాయం ఉందంటున్నారు. సోషల్ మీడియాలో కూడా రేవంత్ చేస్తున్న ప్రచారం సీనియర్లకు కంటగింపుగా వుంది. ఇటీవల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 

ప్రభుత్వంపై పోరాడే ధైర్యం లేని నేతలు కూడా రేవంత్ ని విమర్శిస్తున్నారని, వారంతా సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. రేవంత్ కు పగ్గాలిచ్చేందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ పై పట్టుబిగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ కంపెనీలపై ఈడీ కూడా కన్నేసిందనే ప్రచారం సాగుతోంది. 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   8 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle