newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్‌కు కాంగ్రెస్ రాజ‌కీయాలు అర్థమ‌య్యాయా!

19-03-202019-03-2020 12:51:07 IST
Updated On 19-03-2020 13:34:35 ISTUpdated On 19-03-20202020-03-19T07:21:07.673Z19-03-2020 2020-03-19T07:20:53.709Z - 2020-03-19T08:04:35.757Z - 19-03-2020

రేవంత్‌కు కాంగ్రెస్ రాజ‌కీయాలు అర్థమ‌య్యాయా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని విషయాలను పట్టించుకోకూడదు. ఏది జరిగినా మన మంచికే అన్న ధోరణితో ముందుకు సాగాలి. తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజ‌కీయ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

ఒక వైపు అధికార టీఆర్ఎస్ పార్టీపైన ఎవ‌రూ పోరాడ‌ని స్థాయిలో రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను కేసులు, క‌ష్టాలు వెంటాడుతున్నాయి. మ‌రోవైపు స్వంత పార్టీ కాంగ్రెస్‌లోనూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. 14 రోజుల పాటు జైలులో ఉన్నా తెలంగాణ కాంగ్రెస్‌లోని ముఖ్య నేత‌లు ఎవ‌రూ ఆయ‌న‌ను క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేదు.

జ‌న్వాడ‌లో మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నార‌ని చెబుతున్న ఫామ్ హౌజ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా క‌ట్టార‌ని రేవంత్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఒక్క‌రు త‌ప్ప ఇంకెవ‌రూ కాంగ్రెస్ నేత‌ల‌కు సంబంధం లేకుండా ఆయ‌న ఫామ్ హౌజ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆందోళ‌న చేశారు. దీంతో రేవంత్ రెడ్డి సొంత అజెండాతో వెళుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌లంతా భావించారు. డ్రోన్ కేసులో రేవంత్‌ను జైలుకు పంపిన‌ప్పుడు కూడా కేవ‌లం నామ‌మాత్రంగానే అరెస్టును ఖండించారు.

సీనియ‌ర్ నేత‌ల‌లో న‌లుగురైదుగురు త‌ప్ప ఇంకెవ‌రూ క‌నీసం జైలుకు వెళ్లి కూడా రేవంత్‌ను ప‌రామ‌ర్శించ‌లేదు. ముఖ్యంగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి క‌నీసం రేవంత్ అరెస్టును కూడా ఖండించ‌లేదు. ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించ‌లేదు. రాష్ట్రం నుంచి తోటి ఎంపీలుగా ఉన్న ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పార్ల‌మెంటు జ‌రుగుతున్న‌ప్పుడు ఒక ఎంపీని అరెస్టు చేసిన వ్య‌వ‌హారాన్ని పార్ల‌మెంటులోనూ లేవ‌నెత్త‌లేదు. ఇత‌ర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నించారు.

త‌మ నాయ‌కుడు జైలులో ఉంటే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు క‌నీసం స్పందించ‌డం లేద‌ని, పైగా అది త‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారంలా మాట్లాడుతున్నార‌ని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి వ‌ర్గీయులు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌పై విమ‌ర్శ‌ల‌కు దిగారు. సోష‌ల్ మీడియాలో వారిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. దీంతో జ‌గ్గారెడ్డి, వీహెచ్ లాంటి నేత‌లు రేవంత్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. రేవంత్ జైలులో ఉండ‌గా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ప‌రిస్థితులు అన్నీ త‌న‌కు వ్య‌తిరేకంగా మారిపోయాయి.

నిన్న జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై నేరుగానే విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌ను క‌నీసం ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన జ‌గ్గారెడ్డి, వీహెచ్ వంటి వారితో క‌య్యానికి దిగ‌డానికి రేవంత్ ఇష్ట‌ప‌డ‌లేదు. ఒకేసారి అందరినీ టార్గెట్ చేయ‌డం ద్వారా తాను ఇబ్బంది ప‌డ‌తాన‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న కేవ‌లం ఉత్త‌మ్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజ‌కీయాలు, ఒక‌రిని ఒక‌రు తొక్కేసే ఎత్తుగ‌డ‌లో రేవంత్‌కు బాగానే అర్థ‌మ‌య్యాయి. అందుకే టైమ్ బాగోలేన‌ప్పుడు కొంత త‌గ్గి ఉండ‌ట‌మే మేలు అనేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   38 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle