newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్‌కు కష్టాలు తప్పవా? భూకబ్జా ఆరోపణలపై సర్కార్ సీరియస్

29-02-202029-02-2020 08:33:22 IST
Updated On 29-02-2020 18:12:54 ISTUpdated On 29-02-20202020-02-29T03:03:22.351Z29-02-2020 2020-02-29T03:00:27.304Z - 2020-02-29T12:42:54.528Z - 29-02-2020

రేవంత్‌కు కష్టాలు తప్పవా? భూకబ్జా ఆరోపణలపై సర్కార్ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితిని ధీటుగా ఎదుర్కొనే  కొంద‌రు నేత‌ల్లో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి ఒక‌రు. టీఆర్ఎస్ పార్టీ అన్నా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబం అన్నా ఆయ‌నకు అస్స‌లు ప‌డ‌దు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి అంత తీవ్రంగా ప్ర‌భుత్వంపైన ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌రు. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాల‌ని చూస్తోంది.

ఎన్నిక‌ల ముందు పోలీసు ఒత్తిళ్లు, ఐటీ దాడుల‌తో రేవంత్ రెడ్డి బాగానే ఇబ్బంది ప‌డ్డారు. కొడంగ‌ల్‌లో ఓట‌మి త‌ర్వాత కొంత‌కాలం పాటు ఆయ‌న కూడా సైలెంట్ అయ్యారు. కానీ, మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన త‌ర్వాత మ‌రోసారి అధికార పార్టీకి వ్య‌తిరేకంగా స్పీడ్ పెంచారు. భూకేటాయింపులు, పార్టీ ఫండ్స్ కోసం టీఆర్ఎస్ చేప‌ట్టిన గులాబీ కూలీపై ఆయ‌న కోర్టులో కొట్లాడుతున్నారు. మ‌రో వైపు ప్రజాక్షేత్రంలోనూ ఆయ‌న టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ట్నం ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి కౌంట‌ర్‌గా ప‌ట్నం గోస కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ఒక‌వైపు కొర్టుల్లో, మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ పోరాటం చేస్తుండ‌గా ఆయ‌నపై భూఆక్ర‌మాల ఆరోప‌ణ‌లు మొద‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల గోప‌న్‌ప‌ల్లిలో రేవంత్‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ వ్య‌వ‌హారంలో ఓ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై కూడా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. రేవంత్ రెడ్డి సోద‌రుల‌కు వ్య‌తిరేకంగా ఆర్డీఓకు వ‌రుస‌గా అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఈ వ్యవ‌హారంలో రేవంత్ రెడ్డి ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డంతో పాటు కొత్త కేసును ఎదుర్కునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదిలా కొన‌సాగుతుండ‌గానే రేవంత్ రెడ్డికి సంబంధించిన మ‌రిన్ని వ్య‌వ‌హారాల్లో అక్ర‌మాలు జ‌రిగాయా అని త‌వ్వి తీసే ప‌నిలో టీఆర్ఎస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఉప్ప‌ల్‌లోనూ రేవంత్ రెడ్డికి కొంత భూమి ఉంది. ఈ భూమిని కొనే స‌మ‌యంలో కొన్ని అక్ర‌మ లావాదేవీలు జ‌రిగాయ‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. త్వ‌ర‌లో దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసే అవ‌కాశం ఉంది. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు, అక్ర‌మాలపై అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల్‌రాజ్ దృష్టి పెట్టారు. ఆయ‌నే రేవంత్‌కు వ్య‌తిరేకంగా ఆధారాలు సేక‌రించ‌డం, ఫిర్యాదు చేయించ‌డం వంటివి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, రేవంత్ రెడ్డి మాత్రం పైకి ఇవ‌న్నీ తేలిగ్గా తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. త‌న‌పై ఎన్ని కేసులు పెడితే తాను టీఆర్ఎస్‌పై ఎంత కొట్లాడుతున్నట్లు లెక్క అంటున్నారు. త‌న ఆస్తులు అన్నీ పోయినా టీఆర్ఎస్‌పై పోరాటం మాత్రం ఆప‌న‌ని చెబుతున్నారు. రేవంత్ ధైర్యంగా క‌నిపిస్తున్నా టీఆర్ఎస్‌ మాత్రం ఆయ‌న‌కు చెక్ పెట్టడానికి ఈసారి కొంత సీరియ‌స్‌గానే ప్ర‌య‌త్నిస్తోంది. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న రేవంత్‌రెడ్డికి ఈ కేసులు కొంత ఇబ్బందిగా మారే అవ‌కాశం కూడా ఉంది.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   21 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle