newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

రేపే మంత్రివర్గ భేటీ..!కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు!!

27-11-201927-11-2019 08:54:58 IST
Updated On 27-11-2019 16:03:10 ISTUpdated On 27-11-20192019-11-27T03:24:58.921Z27-11-2019 2019-11-27T03:23:18.455Z - 2019-11-27T10:33:10.713Z - 27-11-2019

రేపే మంత్రివర్గ భేటీ..!కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వ కేబినెట్‌ భేటీ 28 మధ్యాహ్నం జరగనున్నట్లు తెలుస్తోంది. 28, 29 తేదీల్లో జరిగే ఈ కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.

రాష్ట్రంలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రధాన సమస్య అయిన ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన అజెండగా ఆర్టీసీ సమ్మెపైనే చర్చసాగనుందని సమాచారం.

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని 53రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. విధులను బహిష్కరించి రోడ్లపై తమ నిరసనను తెలుపుతున్నారు. అయినా సీఎం కేసీఆర్‌ వారి సమస్యల పరిష్కారంపై ఎక్కడా చొరవ తీసుకోకపోగా.. కార్మికులను సెల్ప్‌ డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

కేసీఆర్‌ తీరుపై కార్మిక సంఘాలు హైకోర్టుకు వెళ్లినప్పటికీ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు రావటంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. లేబర్‌ కోర్టులో ఆర్టీసీ కార్మికుల సమస్య వెళ్లినప్పటికీ పరిష్కారం అనుకూలంగా వస్తుందో లేదోనన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది.

దీంతో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం మేరకు షరతులేమీ లేకుండా విధుల్లో చేరుతామని కార్మికులు పేర్కొన్నారు. అయినా కేసీఆర్‌ వెనక్కు తగ్గలేదు. విధుల్లోకి తీసుకొనేదిలేదని ఖరాఖండీగా చెప్పారు. దీంతో సేవ్‌ ఆర్టీసీ పేరుతో కార్మికులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేపట్టారు.

తాజాగా సోమవారం సాయంత్రం కార్మికులంతా విధుల్లో చేరాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి స్పందించి ఆర్టీసీ యాజమాన్యం ఎవరిని విధుల్లోకి తీసుకోవటం లేదని స్పష్టం చేసింది. మంగళవారం ఆర్టీసీ డిపోల వద్దకు వచ్చిన కార్మికులను ఆర్టీసీ అధికారులు వెనక్కి పంపించివేశారు.

పలువురు కార్మికులు తాము విధుల్లో చేరుతామని, కేసీఆర్‌ కనికరం చూపాలని కోరుతున్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని, ఈ సారి కేసీఆర్‌ నిర్ణయం మేరకు విధుల్లో చేరుతామని చెబుతున్నారు. ఆర్టీసీ జేఏసీ కూడా పంతానికి పోయే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌ కార్మికుల సమ్మెపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కార్మికుల విజ్ఞప్తుల మేరకు షరతులతో విధుల్లోకి చేర్చుకొనేందుకు కేసీఆర్‌ అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగుతుంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతున్నప్పటికీ.. తెరాస పార్టీకి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెరాసకు నిన్నమొన్నటి వరకు అండగా ఉద్యోగులు నిలిచారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ తీరుపై తెరాసకు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు.

ఇటీవల రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులు లంచావతారులని నేరుగా సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యల మూలంగానే ఇటీవల తహసీల్దార్‌పై హత్య జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికులుసైతం కేసీఆర్‌ తాజా మొండి వైఖరితో తెరాసకు దూరమవుతున్నారు. ఈ గ్యాప్‌ను భర్తీచేస్తూ రాబోయే కాలంలో మళ్లీ ఉద్యోగ వర్గాలు తెరాసవైపే ఉండేలా సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

దీనిలో భాగంగా ఎల్లుడి జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం సానుకూలంగా వ్యవహరించతో పాటు, ప్రతిపక్షాల మాటవిని మీరు ఆందోళన చేయటం వల్లనే

మొండిగా వ్యవహరించాల్సి వచ్చిందని, కార్మికుల శ్రేయస్సే మాకు ముఖ్యమని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు చనిపోయిన కార్మికులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు రెవెన్యూ ఉద్యోగులపైనా వరాలు కురిపించేలా కేబినెట్‌లో కేసీఆర్‌ నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయని, దీంతో రెవెన్యూ ఉద్యోగులను మళ్లీ తనవైపుకు లాక్కొనేలా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెరాస నేతల్లో చర్చ సాగుతుంది.

మొత్తానికి రెండు రోజుల పాటు జరిగే కేబినెట్‌ భేటీ ద్వారా అటు ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగ వర్గాలను మళ్లీ తమవైపు తిప్పుకొనేలా కేసీఆర్‌ నిర్ణయాలు ఉండబోతున్నాయని ప్రచారం సాగుతుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle