రేపటి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్..
07-09-202007-09-2020 17:06:59 IST
2020-09-07T11:36:59.911Z07-09-2020 2020-09-07T11:36:56.660Z - - 23-04-2021

తెలంగాణలోని రిజిస్ర్టేషన్ల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిరవధిక సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో విస్పష్టంగా పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిజిస్ట్రార్ కార్యాలయాలు ముతపడనున్నాయి. నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే...ప్రభుత్వం అందుకు అనగుణంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులకు నిరవధిక సెలవు ప్రకటించిందని భావిస్తున్నారు. అయితే ఈ నిరవధిక సెలవు ఎంత కాలం అన్న విషయంలో ఈ ఉత్తర్వులలో ఎలాంటి సమాచారం లేదు. స్టాంపుల కొనుగోలు, చలాన్లు చెల్లించిన వారికి రిజిస్ర్టేషన్లు ఈ రోజు జరుగుతాయని ప్రకటించింది. ఇక స్టాంపుల విక్రయాలు పూర్తిగా నిలిపివేసింది. దీంతో మంగళవారం నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం దృష్ట్యా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందని భావించాల్సి ఉంటుంది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా ఉదయం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. నిరవధిక సెలవులో పంపిన ఉద్యోగుల భవితవ్యం గురించి ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. రెవెన్యూ చట్టం కసరత్తులో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా...ఒక్క ఉత్తర్వుతో ఉద్యోగులను నిరవధిక సెలవులో పంపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పేరుతో సహా ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించజాలరు. కానీ...ఉద్యోగుల పరిస్థితి త్రిశంకు సర్వర్గంలో ఉన్నట్లుగా మార్చడం పట్లే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ సర్వీసు రూల్స్ మేరకు ఈ శాఖ ఉద్యోగులను ఇతర శాఖలలోకి బదలీల ద్వారా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అందుకు భిన్నంగా సెలవులో పంపించడం సబబు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా రెవెన్యూ శాఖ మారిపోయిందన్న ఆరోపణలు జన బాహుల్యం నుంచి చాలా కాలంగా వినవస్తున్న మాట వాస్తవమే. అంత మాత్రాన ఆ శాఖలో ఉద్యోగులంతా అవినీతి పరులే అని ముద్ర వేసినట్లుగా ప్రభుత్వ తీరు ఉన్నదని అంటున్నారు. అన్ని అధికారాలూ ఉన్న ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు రద్దులు, సెలవులూ అంటూ ఇబ్బందులకు గురి చేయడం తగదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
20 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా