newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

19-11-201919-11-2019 13:00:26 IST
Updated On 19-11-2019 15:24:22 ISTUpdated On 19-11-20192019-11-19T07:30:26.128Z19-11-2019 2019-11-19T07:30:20.617Z - 2019-11-19T09:54:22.799Z - 19-11-2019

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అబ్దుల్లాపూర్ మేట్ తహసిల్దార్ విజయా రెడ్డిని భూమికి పట్టా ఇమ్మని ప్రాధేయపడినా ఇవ్వలేదనే కసితో ఆమె కార్యాలయంలోనే సజీవంగా తగులబెట్టిన ఘటన గురించి తెలిసిందే. కానీ ఈ దారుణ ఘటన కేవలం యాధృచ్చికం కాదని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ రెవెన్యూ అధికారులపై  జనం ఆగ్రహంతో దహించుకుపోతున్నారని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజా ఉదాహరణకు కరీంనగర్ సాక్షీభూతమై నిలుస్తోంది. కానీ ఇక్కడ ఏ అధికారిపై పెట్రోల్ పోయలేదు కానీ అధికారులందరినీ పెట్రోల్ పోసి కాలబెట్టాలె అంటూ ఆగ్రహంతో మండిపడ్డాడు ఒక బాధితుడు. ఆయన పేరు మల్లికార్జున్. కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ నివాసి. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హల్‌చల్‌ చేశాడీ రైతు. ‘‘నా భూమి కోసం 15 ఏళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు. అధికారులందరిని పెట్రోల్‌ పోసి కాలబెట్టాలె..’’ అంటూ ఆగ్రహంతో వణికిపోయాడు.

తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా తమ కార్యాలయాలకు వస్తున్న రైతులను చూసి రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారంటే దానికి మల్లికార్జున్ వంటి రైతుల ఆగ్రహమే కారణం. 

వివరాల్లోకి వెళితే.. రిటైర్డు ఎంఈవో మల్లికార్జున్‌కు బొమ్మకల్‌లో 3.24 గుంటల భూమి ఉంది. 15 ఏళ్ల క్రితం తన కుమారుడు విజయ్‌ పేరిట పాసుపుస్తకం ఎందుకిచ్చారని, తన భూమిని తనకే ఇవ్వాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నాడు. కొడుకు పేరిట రిజిస్ట్రేషన్‌ ఉండడంతో అధికారులు మిన్నకున్నారు.

దీంతో సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చిన మల్లికార్జున్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డాడు. పదిహేనేండ్ల నుంచి తిరుగున్నా పట్టించుకోవడం లేదంటూ, అధికారులపై పెట్రోల్‌ పోసి కాలపెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మల్లికార్జున్‌ తీవ్ర పదజాలంతో అధికారులను దూషిస్తుండడంతో డీఆర్‌వో ప్రావీణ్య పోలీసులకు తెలిపారు. 

అధికారులపై పెట్రోల్ పోసి కాలబెట్టాలంటూ ఆవేశంతో ఊగిపోతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆ తర్వాత స్ధానిక నేతల విజ్ఞప్తి మేరకు మల్లికార్జున్‌ను విడిచిపెట్టారు.

ఇలాంటి రైతులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టినందుకు రెవెన్యూ అధికారులపై మండిపడటం లేదు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ధర్మాగ్రహం. పదిహేను సంవత్సరాలు ఊరి నుంచి కాలికి బలపం పెట్టుకుని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా రైతుకు పాసు పుస్తకం ఇవ్వకపోతే, ఎందుకు ఇవ్వలేకపోయామన్న విషయం ఆ రైతుకు నచ్చచెప్పలేకపోతే వచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది.

‘‘నా భూమి కోసం 15 ఏళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు. అధికారులందరిని పెట్రోల్‌ పోసి కాలబెట్టాలె..’’ ఒక సాధారణ రైతు నోట ఇంలాంటి హింసాత్మక  స్వరం వినబడుతుందంటే కారకులెవ్వరు.. ప్రభుత్వ చేతకానితనమా.. రెవెన్యూ ఉద్యోగుల పరమ నిర్లక్ష్యమా? ఏది కారణం?

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle