newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

రెవిన్యూ కోడ్‌తో అద్భుతాలు జరుగుతాయా? భూవివాదాలు తీరతాయా?

13-02-202013-02-2020 10:35:51 IST
Updated On 13-02-2020 15:29:18 ISTUpdated On 13-02-20202020-02-13T05:05:51.867Z13-02-2020 2020-02-13T05:05:48.626Z - 2020-02-13T09:59:18.081Z - 13-02-2020

రెవిన్యూ కోడ్‌తో అద్భుతాలు జరుగుతాయా? భూవివాదాలు తీరతాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో భ్రష్టుపట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నడుం కట్టారు. డబ్బులివ్వందే పనులు కాకపోవడం రెవెన్యూ శాఖకు అలవాటైపోయిందని గతంలోనే ధ్వజమెత్తిన కేసీఆర్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనం చేయడానికి సిద్ధమైపోయినట్లేనని తెలుస్తోంది. తెలంగాణలో దశాబ్దాలుగా భూ పరిపాలన, హక్కులపై ఉన్న గందరగోళాలకు తెరదించుతూ, దీనికి సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఉత్తరప్రదేశ్‌ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

ఈ మేరకు యూపీ సర్కారు 2016లో అమల్లోకి తెచ్చిన రెవెన్యూ కోడ్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రం కోసం కొత్త రెవెన్యూ కోడ్‌కు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ యూపీ కోడ్‌ అధ్యయనం చేసే పనిలో పడినట్లు సమాచారం. 

వాస్తవానికి, నిజాం రాష్ట్రంలో ‘ఫస్లీ–1317’చట్టాన్ని రూపొందించారు. ఈ ఫస్లీయే ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని రెవెన్యూ చట్టాలకు భూమికగా వస్తోంది. భూ పరిపాలనకు సంబంధించిన అన్ని చట్టాలు, భాగాలు, అధ్యాయాలు, సెక్షన్లు అన్నీ ఈ చట్టంలో సమగ్రంగా ఉండేవి. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత భూపాలన, హక్కులకు సంబంధించిన ఒక్కో అంశంపై ఒక్కో చట్టం చేశారు. లేదంటే చట్టంలోనే సబ్‌ సెక్షన్లుగా నియమ నిబంధనలను విడగొట్టారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు రూల్స్‌ అమల్లో ఉన్నాయి. 

ఇబ్బడిముబ్బడిగా ఉన్న వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి యూపీ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అదే తరహాలో కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని యోచిస్తోంది. మరోవైపు పాశ్చాత్య దేశాలే కాకుండా, పొరుగు రాష్ట్రంలోనూ అమలు చేస్తున్న టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నా, ఇది అమల్లో కష్టసాధ్యమని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రెవెన్యూ కోడ్‌ లేదా తెలంగాణ భూచట్టం’వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కోడ్‌కు తుదిరూపు ఇచ్చేముందుకు ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి కోడ్‌పై విస్తృతంగా చర్చించాలని కూడా ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ‘పాస్‌ పుస్తకం కోసం మా దోస్తు పోతే వీఆర్వో పైసలు అడిగిండు. అసలేం జరుగుతోంది.

విజయారెడ్డిని అన్యాయంగా పోగొట్టుకున్నం. చిన్న పిల్లలు అన్యాయమైపోయారు. ఇలాంటి సంఘటనల తర్వాత కూడా రెవెన్యూ వాళ్లు మారరా కనువిప్పు కలగాలి. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. భూ రికార్డుల ప్రక్షాళనను లోపభూయిష్టంగా చేశారు. భూ రికార్డులు సరిగ్గా ఉన్న ప్రాంతాల్లో 3 శాతం జీడీపీ అదనంగా వస్తోందని రుజువైంది. ఇప్పటికైనా మార్పు రావాలి’అని సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

రెవెన్యూ కోడ్ తెలంగాణలో భూవివాదాలను ప్రక్షాళన చేయగలదని భావిస్తున్నారు.

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   3 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   3 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   3 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   3 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   4 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   4 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   5 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   6 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   6 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle