newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

రెడ్ జోన్లలో ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?

06-05-202006-05-2020 10:41:18 IST
Updated On 06-05-2020 11:05:10 ISTUpdated On 06-05-20202020-05-06T05:11:18.636Z06-05-2020 2020-05-06T05:11:03.584Z - 2020-05-06T05:35:10.994Z - 06-05-2020

రెడ్ జోన్లలో ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కేంద్రం రెడ్ జోన్ గా ప్రకటించింది. ఈ జోన్లలో అన్ని కార్యక్రమాలు నిషేధించబడ్డాయి. కొన్నింటికి ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ ఆరు జిల్లాల్లో రెడ్ జోన్ ఆంక్షలు, సడలింపులు అమలులో వుంటాయి.  రెడ్‌జోన్‌లో షాపులు ఓపెన్‌ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది కానీ, మనం మాత్రం ఈ ఆరుజిల్లాల్లో ఓపెన్‌ చేయడం లేదని సీఏం కేసీయార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్ జోన్లలో మద్యం షాపులు కూడా తెరిచే అవకాశం ఉంది. కానీ కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం మద్యం షాపులపై కూడా నిషేధం అమలులో వుంది. 

*సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, అంతర్‌ జిల్లాతోపాటు జిల్లా లోపల బస్సు ప్రయాణాలు, బార్బర్‌ షాపులు, స్పాలు, సెలూన్లపై నిషేధం.

*కార్లలో డ్రైవర్‌ కాకుండా ఇద్దరు, ద్విచక్రవాహనాలపై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. 

*పట్టణ ప్రాంతాల్లో సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌లకు అనుమతి. 

*మందులు, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు, వాటి ముడిసరుకుల ఉత్పత్తుల సంస్థలకు అనుమతులిచ్చారు.

*నిరంతరం కొనసాగించాల్సిన ఉత్పత్తి యూనిట్లు వాటి సప్లయ్‌ చైన్లకు అనుమతి.

*ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ సంస్థలు పనిచేస్తాయి.

*షిఫ్టులతో జూట్‌ పరిశ్రమలకు అనుమతి

*ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ తయారీ సంస్థలకు గ్రీన్‌సిగ్నల్‌. 

*స్థానిక కూలీలతో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి. 

*పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాల అనుమతి.

*పట్టణాల్లో అత్యవసరమా కాదా అన్నదానితో నిమిత్తం లేకుండా సింగిల్‌ షాపులు, కాలనీలు, నివాస గృహ సముదాయాల్లో ఉండే దుకాణాలకు అనుమతి. 

*అత్యవసర సరుకుల అమ్మకాలకు మాత్రమే ఈ-కామర్స్‌ సంస్థలకు అనుమతి. 

*33 శాతం సిబ్బందితో ప్రైవేట్‌ సంస్థలు నడిపేందుకు అనుమతి. మిగిలినవారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం. 

*అన్ని ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయి. డిప్యూటీ సెక్రటరీ ఆ పై స్థాయి అధికారులు అందరూ హాజరుకావచ్చు. మిగతా సిబ్బందిలో 33% మందికే అనుమతి. రక్షణ, భద్రతా సేవలు, వైద్య, కుటుంబ *సంక్షేమం, పోలీస్‌, జైళ్లు, హోం గార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తు నియంత్రణ, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌, కస్టమ్స్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్సీసీ, *నెహ్రూ యువ కేంద్ర, మున్సిపల్‌ సేవలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. 

*గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇటుకల బట్టీలుసహా అన్ని పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. షాపింగ్‌ మాల్స్‌ తప్ప అన్ని దుకాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌.

* వ్యవసాయ కార్యక్రమాలకు ఆమోదం.

*పశుపోషణ కార్యకలాపాలకు అనుమతి 

*ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌తోసహా అన్ని ప్లాంటేషన్‌ కార్యక్రమాలకు అనుమతి.

*అన్నిరకాల వైద్యసేవలు కొనసాగుతాయి. 

*బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్‌, క్యాపిటల్‌ మార్కెట్‌, క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీల సేవలు కొనసాగుతాయి. 

*వృద్ధాశ్రమాలు, అనాథలు, వితంతువులు, మహిళా సంరక్షణ కేంద్రాలు పనిచేస్తాయి. 

*అంగన్‌వాడీ కేంద్రాలకు అనుమతి.

*విద్యుత్‌, నీరు, శానిటేషన్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, టెలికమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌, కొరియర్‌, పోస్టల్‌ సేవలు కొనసాగుతాయి.

*ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, కాల్‌సెంటర్లు, శీతల గిడ్డంగులు, గోదాములు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సేవలకు అనుమతినిచ్చారు. 

*బార్బర్లు మినహా స్వయం ఉపాధి పొందే వ్యక్తులు పనిచేసుకొనేందుకు అనుమతి.

ఇవి నిషేధం

*దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సేవలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా

*స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్య, శిక్షణా సంస్థలు

*హోటళ్లు, రెస్టారెంట్లు

*సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, క్రీడా కాంప్లెక్సులు తదితరాలు

*సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు

*అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, మతపరమైన కార్యక్రమాలు

 

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   3 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   3 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   6 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   7 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   7 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   8 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   8 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   8 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   8 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle