newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

రూ.87.59 లక్షల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 1112 కోట్ల నగదు పంపిణీ రేపే

14-04-202014-04-2020 16:33:59 IST
Updated On 14-04-2020 16:43:08 ISTUpdated On 14-04-20202020-04-14T11:03:59.958Z14-04-2020 2020-04-14T11:03:57.532Z - 2020-04-14T11:13:08.840Z - 14-04-2020

రూ.87.59 లక్షల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 1112 కోట్ల నగదు పంపిణీ రేపే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నగదు వలంటీర్ల గుండా లబ్ధిదారుల చేతికి అందించే పద్ధతికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం కరోనా విపత్తు నేపధ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రకటించిన రూ.1500 నగదు పంపిణీ బుధవారం నుంచి జరగనుంది. ఈ మేరకు నగదు బదిలీ ప్రక్రియ సోమవారమే మొదలైంది. మొదటి విడతగా రూ.1112 కోట్లు సర్దుబాటు చేసిన ప్రభుత్వం.. ఈ నిధులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమ చేసింది. అక్కడి నుంచి ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ‘ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌’ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. 

మంగళవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో.. బుధవారం నుంచి చెల్లింపులు చేయనున్నారు. ఏటీఎం కార్డులు ఉన్నవారు మాత్రం మెసేజ్‌ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు. కరోనా విపత్తు కింద రాష్ట్రంలోని 87.59 లక్షల మంది తెల్లరేషన్‌ కార్డుదారులకు ఒక్కో కార్డుపై రూ.1500 చొప్పున నగదు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే నిధుల సర్దుబాటు, పంపిణీ ప్రక్రియపై కొద్దిరోజులుగా తర్జనభర్జన జరిగింది. చివరకు సోమవారం నాటికి వ్యవహారం కొలిక్కివచ్చింది. ఎన్‌పీసీఐ వద్ద ఆధార్‌తో మ్యాపింగ్‌ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెప్పించుకుంది. ఆ డేటాతో సివిల్‌ సప్లైస్‌ వద్ద ఉన్న డేటాను స్ర్కీనింగ్‌ చేశారు. తెల్లరేషన్‌కార్డుదారుకు బ్యాంకు అకౌంట్‌ ఉంటే ఆ వివరాలు, అకౌంట్‌ లేకుంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి బ్యాంకు అకౌంట్‌ వివరాలను జోడించి ప్యూరిఫై చేసిన డేటాను ఎస్‌బీఐకి పంపించారు. అక్కడినుంచి ఎన్‌పీసీఐకి పంపారు. ఎన్‌పీసీఐ నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేశారు.

అకౌంట్లలోకి నేడే డబ్బు జమ కేటీఆర్‌

రాష్ట్రంలోని 87.59 లక్షల తెల్లకార్డు హోల్డర్లకుగాను 74,07,486 మంది బ్యాంకు ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఆధార్‌ నంబర్‌తో మ్యాపింగ్‌ అయి ఉంటే‘‘ యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ సిస్టమ్‌’’ ద్వారా ఆధార్‌ నంబర్‌కు మ్యాపింగ్‌ అయి ఉన్న అకౌంట్లలో చివరి ట్రాన్సాక్షన్‌ ఏ అకౌంట్‌తో చేస్తే ఆ అకౌంట్‌కు డబ్బులు వెళ్లిపోతాయి.  

లబ్ధిదారుల అకౌంట్లలోకి మంగళవారమే నగదు జమ అవుతుందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే రేషన్‌కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ అయి ఉండి, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ లేనివారికి రెండో విడతలో నగదు బదిలీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   2 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   3 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   3 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   3 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   4 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   4 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   4 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   6 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   6 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle