రూ. లక్షా 82 వేల 914.42 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2020-21
08-03-202008-03-2020 12:02:46 IST
Updated On 08-03-2020 12:50:34 ISTUpdated On 08-03-20202020-03-08T06:32:46.501Z08-03-2020 2020-03-08T06:32:32.138Z - 2020-03-08T07:20:34.160Z - 08-03-2020

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ 2020-21ను సభలో ప్రవేశపెట్టారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. తెలంగాణ 2020-21 బడ్జెట్ మొత్తం లక్షా,82 వేల 914.42 కోట్లుగా ప్రకటించారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం- 1, 38, 669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం--- 22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు 4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లుగా ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018-19 లో 16.1% ఉంటే, 2019-20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు శనివారం రాత్రి ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన బడ్జెట్‌పై చర్చించి ఆమోదించారు.శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు, ప్రాధాన్య పథకాలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్ రూపకల్పన జరిగింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి బడ్జెట్ ప్రతులను అందజేసిన మంత్రులు.. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారి అనుమతి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి రూ.790 కోట్లు కేటాయించింది. మున్సిపల్ శాఖకు రూ.14,809 కోట్లు, ఫీజు రీయింబర్సమెంట్కు రూ.2,650 కోట్ల కేటాయింపులు. ఎస్టీ డెవలప్మెంట్ కోసం రూ.95,711 కోట్ల కేటాయించారు. పాఠశాల విద్యకు రూ.10,350 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,136 కోట్లు ,ఎస్సీల ప్రత్యేక డెవలప్మెంట్ కోసం రూ.16,435 కోట్లు, షెడ్యూళ్ల కులాల కోసం రూ.4,530 కోట్ల కేటాయించారు. పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు, ఎంబీసీలకు రూ.500 కోట్లు, మత్స్యకారుల సంక్షేమానికి రూ.1,586 కోట్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలకు రూ.350 కోట్లను కేటాయించారు. ప్రతిష్టాత్మకమయిన రైతు బంధు పథకానికి రూ.14,000 కోట్లు, రైతు బీమాకు రూ.1,140 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.2,230 కోట్లు కేటాయింపులు. సాగునీటి పారుదల రంగానికి రూ.11,054 కోట్లు, రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే జీఎస్డీపీ 12.6 శాతానికి తగ్గిందన్నారు మంత్రి హరీష్ రావు. 2020-21 ఆర్థిక సంవత్సరం లో మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 2, 384 కోట్లు తగ్గాయన్నారు. 2019-20 బడ్జెట్ లో అంచనాల మేరకు మార్చ్ నెలాఖరు వరకు 1, 36 000 కోట్లు ఖర్చు జరుగుతుంది. 2019-20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం 2,28,216 కోట్లు ఉండగా...దేశ తలసరి ఆదాయం 1,35,050 కోట్లు వుంది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 93, 166 కోట్లు ఎక్కువగా వుంది.రైతు బీమా కోసం 1,141 కోట్లు, 2020-21 లో రైతు రుణమాఫీ కోసం 6,225 కోట్లు, ఈ బడ్జెట్ లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం 1వెయ్యి కోట్ల ప్రతిపాదనలు చేశారు. మైక్రో ఇరిగేషన్ కోసం ఈ ఏడాది 600 కోట్లు అమలు చేయాలని నిర్ణయించామని ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు. రైతు వేదికల కోసం 350కోట్లు ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో విజయడైరీ 30 కోట్ల నష్టాలతో మూతపడే పరిస్థితి కి దిగజారింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకాల కోసం బడ్జెట్ లో 100 కోట్ల ప్రతిపాదనలు చేశారు. సాగునీటి పారుదల రంగానికి 2020-21 బడ్జెట్ లో 11,054 కోట్ల ప్రతిపాదనలు, ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు ఈ బడ్జెట్ లో 11, 758 కోట్ల ప్రతిపాదనలు చేశారు. ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16, 534.97 కోట్లు- ఎస్టి ప్రత్యేక ప్రగతి నిధి కోసం 9,771.27 కోట్లు, మైనార్టీల అభివృద్ధి-సంక్షేమం కోసం 1518.06 కోట్లు కేటాయించారు. వీటితోపాటు పశుపోషణ-మత్స్యశాఖకు 1586.38 కోట్ల ప్రతిపాదనలు, కళ్యాణలక్ష్మి-బీసీల కోసం 1350 కోట్లు, ఎంబిసి కార్పొరేషన్ కోసం 500 కోట్లు కేటాయించారు. మొత్తం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 4,356.82 కోట్ల ప్రతిపాదనలు, మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 12వందల కోట్లు కేటాయించారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం 23,005 కోట్లు, 38 మున్సిపాలిటీ లకు గాను 800 కోట్ల ప్రతిపాదనలు చేశారు. మున్సిపల్ శాఖకు ఈ బడ్జెట్ లో 14, 809 కోట్లు, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10వేల కోట్లు, ఫీజు రియంబర్స్ మెంటు కోసం 2,650 కోట్ల ప్రతిపాదనలు చేశారు. పాఠశాల విద్యాశాఖకు 10, 421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 1,723.27 కోట్లు, సంపూర్ణ అక్షరాస్యత కోసం వంద కోట్లు, వైద్యరంగానికి 2020-21లో 6, 186 కోట్లు కేటాయించారు. విద్యుత్ శాఖకు 10, 416 కోట్ల ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమల రంగంలో ఇండస్ట్రియల్ ఇంస్టెంటివ్స్ 2020-21లో 15వందల కోట్లు కేటాయించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం 1998 కోట్లు, ఆర్టీసీ అభివృద్ధి కోసం 1000 కోట్లు, గృహ నిర్మాణాల కోసం 2020-21లో 11,917 కోట్లు కేటాయించారు. పర్యావరణ-అతవిశాఖకు 791 కోట్లు, దేవాలయాల అభివృద్ధి కోసం 5 వందల కోట్లు ధూపదీప నైవేద్యాల కోసం 50కోట్లు కేటాయించారు. రహదారుల నిర్మాణం-నిర్వహణ కోసం 750 కోట్లు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం 550 కోట్లు, 2020-21 బడ్జెట్ లో పొలీస్ శాఖకు 5,852 కోట్లు, ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల ఎస్ డిపి నిధుల కోసం 480 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు.

ఏపీలో స్కూల్స్ బంద్
12 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
11 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
16 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
17 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
13 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
20 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
12 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
14 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
20 hours ago
ఇంకా