newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూట్ మార్చిన కొండా దంప‌తులు.. మ‌ళ్లీ న‌గ‌రంలోనే అడ్డా..!

31-08-202031-08-2020 08:06:08 IST
Updated On 31-08-2020 09:29:12 ISTUpdated On 31-08-20202020-08-31T02:36:08.483Z31-08-2020 2020-08-31T02:35:52.639Z - 2020-08-31T03:59:12.981Z - 31-08-2020

రూట్ మార్చిన కొండా  దంప‌తులు.. మ‌ళ్లీ న‌గ‌రంలోనే అడ్డా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క నేత‌లుగా కొండా సురేఖ - ముర‌ళీధ‌ర్‌రావు దంప‌తులు కొన‌సాగుతున్నారు. ఒకానొక స‌మ‌యంలో వీరు రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌ప‌డ్డారు. అయితే, క్ర‌మంగా వీరి ప్ర‌భావం రాష్ట్రంలో, జిల్లాలో త‌గ్గుతూ వెళుతోంది. ఆఖ‌రికి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలోనే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. దీంతో చాలా కాలం పాటు సైలెంట్‌గా మారిన కొండా దంప‌తులు ఇప్పుడు మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఈసారి ముందునుంచే టార్గెట్ పెట్టుకొని వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు అసెంబ్లీ స్థానాల‌ను గెల‌వాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ క్ర‌మంలో స్వంత నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొండా దంప‌తుల హ‌వా న‌డిచేది. వైఎస్ శిష్యులుగా పేరొందిన వీరికి మంచి ప్రాధాన్య‌త ఉండేది. ఈ క్ర‌మంలో 2009లో కొండా సురేఖ‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. దీంతో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో, వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రింత బ‌ల‌మైన నాయ‌కులుగా కొండా దంప‌తులు ఎదిగారు. కానీ, కొంత‌కాలానికి వీరికి రాజ‌కీయంగా ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత మంత్రి ప‌ద‌విని వ‌దిలేసి జ‌గ‌న్ వెంట న‌డిచారు. అప్పుడు ఉమ్మ‌డి ఏపీలో వీరికి మంచి గుర్తింపు ద‌క్కింది గానీ రాజ‌కీయంగా మాత్రం అంత మంచి ఏమీ జ‌ర‌గ‌లేదు.

వైసీపీలోకి వెళ్లిన త‌ర్వాత 2012లో ఎమ్మెల్యే ప‌‌ద‌విని కూడా వ‌దులుకొని ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు కొండా సురేఖ‌. తెలంగాణ ఉద్య‌మం తార‌స్థాయిలో ఉన్న స‌మ‌యంలో స‌మైక్య పార్టీగా ముద్ర‌ప‌డిన వైసీపీ నుంచి కొండా సురేఖ పోటీ చేసి ఓడారు. అయితే, అప్పుడు ఏ ఉప ఎన్నిక జ‌రిగినా టీఆర్ఎస్ పార్టీకి 30 - 80 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కేది. కానీ, కొండా సురేఖ మాత్రం ప‌ర‌కాల‌లో త‌న బ‌లాన్ని చాటుకొని ఆ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చి టీఆర్ఎస్‌ను ఓటమి అంచుల్లోకి తీసుకెళ్ల‌గ‌లిగారు. అప్పుడే ప‌ర‌కాల కొండా దంప‌తుల కంచుకోట‌గా ముద్ర‌ప‌డింది.

త‌ర్వాత జ‌గ‌న్‌కు దూర‌మై 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు కొండా దంప‌తులు. త‌మ‌కు అంత‌లా బ‌ల‌మున్న ప‌ర‌కాల‌ను వ‌దులుకొని కేసీఆర్ ఆదేశాల మేర‌కు వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి మారి ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. 2014లో ప‌ర‌కాల‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన చ‌ల్లా ధ‌ర్మారెడ్డి త‌ర్వాత టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు.

ప్రాంతీయ పార్టీలో ఉండే ప‌రిమితుల నేప‌థ్యంలో 2014 నుంచి 2018 వ‌ర‌కు కొండా దంప‌తులు వ‌రంగ‌ల్ ఈస్ట్‌కే ప‌రిమిత‌మై ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాన్ని పూర్తిగా వ‌దిలేశారు. ఈ క్ర‌మంలో కొండా దంప‌తుల‌కు ప‌ర‌కాల‌లో ఉన్న బ‌ల‌మైన అనుచ‌ర‌వ‌ర్గం మొత్తం చ‌ల్లా ధ‌ర్మారెడ్డి త‌న వైపు తిప్పుకున్నారు. ఎప్పుడూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ఆయ‌న ప‌ర‌కాల‌లో ప‌ట్టు సాధించారు.

2018 ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్‌ను వీడిన కొండా సురేఖ ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిట్టింగ్ స్థాన‌మైన వ‌రంగ‌ల్ ఈస్ట్‌ను వ‌దిలేసి త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌కు వెళ్లారు. ప‌ర‌కాల‌లో క్షేత్ర‌స్థాయిలో రాజకీయ ప‌రిస్థితుల‌ను, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి బ‌లాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోయిన కొండా సురేఖ ఆ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నుంచి భారీ ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

ఇంత భారీ ఓట‌మిని వారు ఏ మాత్రం ఊహించ‌లేదు. దీంతో చాలా రోజుల పాటు రాజ‌కీయంగా కొండా దంప‌తులు సైలెంట్ అయ్యారు. అయితే, ఇప్పుడు వారికి చేసిన పొర‌పాటు అర్థమయిన‌ట్లుంది. ప‌ర‌కాల కంటే వ‌రంగ‌ల్ ఈస్ట్ అయితేనే సేఫ్ అని భావిస్తున్నారు.

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొండా దంప‌తులు రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. వరంగ‌ల్ ఈస్ట్ ప‌రిధిలోని 23 డివిజ‌న్ల‌లో త‌న అనుచ‌రుల‌ను పోటీ చేయించ‌డానికి సిద్ధం చేస్తున్నారు.

ఇటీవ‌ల పూర్తిగా ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంపైనే కొండా దంప‌తులు ఫోక‌స్ చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో మెజారిటీ స్థానాలు సాధించి నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకోవాల‌నేది వీరి ఆలోచ‌నగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొండా సురేఖ ప‌ర‌కాల‌ను పూర్తిగా వ‌దిలేసి వ‌రంగ‌ల్ ఈస్ట్‌పైనే దృష్టి పెట్ట‌బోతున్నారు. కొండా ముర‌ళి మాత్రం భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి, కొండా దంప‌తులు వేస్తున్న ఈ ప్లాన్ ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   31 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle