newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

రూటు మార్చిన తుమ్మల..! పట్టునిలుపుకొనేనా?

19-12-201919-12-2019 16:01:04 IST
Updated On 20-12-2019 11:11:09 ISTUpdated On 20-12-20192019-12-19T10:31:04.345Z19-12-2019 2019-12-19T10:31:00.407Z - 2019-12-20T05:41:09.454Z - 20-12-2019

రూటు మార్చిన తుమ్మల..!  పట్టునిలుపుకొనేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. అపర రాజకీయ చాణ్యుడిగానూ ఖమ్మం వాసులు పిలుచుకుంటారు. సీఎం కేసీఆర్‌కు తుమ్మల అత్యంత సన్నిహితుడు. కానీ ఇప్పుడు అలాంటి తుమ్మలకు ఎదురుగాలి వీస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో పాలేరు నియోజకవర్గంలో పోటీచేసి తుమ్మల.. కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేంద్ర రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమిపాలైన తుమ్మల నాగేశ్వరరావు.. కొంత కాలానికి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన కందాల ఉపేంద్ర రెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవటంతో పాలేరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలో చేరిననాటి నుంచి కందాల తనదైన శైలిలో ముందుకెళ్తూ తన వర్గాని ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇదే సమయంలో తుమ్మల వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను తుమ్మల వద్ద మొరపెట్టుకోవటంతో.. తుమ్మల మళ్లీ నియోజకవర్గ బాటపట్టారు.

తన వర్గీయులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపారు. ఇదే సమయంలో పార్టీ మండల కమిటీల్లో కందాల తన వర్గీయులకే ప్రాధాన్యతనివ్వటంతో వివాదం కేటీఆర్‌, కేసీఆర్‌ వద్దకు చేరింది. కొద్దిరోజులుగా వివాదం సర్దుమణిగిందనుకున్న సమయంలో తాజాగా తుమ్మల వర్గీయులపై కేసు నమోదు కావటం, జైలుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామంలో గత నెల 11న రెండు వర్గాల మధ్య జరిగిన తగాదా రాజకీయ దుమారం రేపింది. 11మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు. మిగతా వారిని వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జైలులో ఉన్న తమ వర్గీయులను తుమ్మల నాగేశ్వరరావు గత రెండు రోజుల క్రితం వెళ్లి కలిశారు. వారితో మాట్లాడారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. అభివృద్ధిచేసే ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించవద్దని, తప్పుడు కేసులు పెట్టి పార్టీ నష్టం తేవద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు.

ఇదిలా ఉంటే తుమ్మల వ్యాఖ్యలను ప్రత్యర్థి వర్గీయులు మరోలా అర్థంచేసుకోవటం కొసమెరుపు. తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్‌, కేటీఆర్‌లు ప్రాధాన్యతనివ్వటం లేదని, పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారని, అందుకే తుమ్మల వేదాంతం వ్యక్తం చేస్తున్నట్టుగా పేర్కొంటున్నారు. కానీ తుమ్మల మాత్రం వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తన రాజకీయ చతురతకు తుమ్మల పదునుపెట్టినట్లు సమాచారం.

ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో తన క్యాడర్‌ను కాపాడుకొనేందుకు, తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు తుమ్మల వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. మొన్నటివరకు తుమ్మల, నామా నాగేశ్వరరావులకు పెద్దగా పడేది కాదు. కానీ ఇప్పుడు నామా, తుమ్మల మంచి మిత్రులు కావటం గమనార్హం. ఇటీవల ఓ కార్యక్రమంలో తుమ్మల, నామాలు రహస్యంగా మాట్లాడుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నామాతో తుమ్మల మాట్లాడుతున్నట్లు ఈ ఫోటో ఉంది. దీంతో తుమ్మల వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.

నామాకు పాలేరు నియోజకవర్గంలో మంచి పట్టుంది. నామా, తుమ్మల ఇద్దరు ఏకమైతే ఇక మనకు నియోజకవర్గంలో తిరుగుండదనే భావంలో తుమ్మల వర్గీయులు ఉన్నారు. మరి వీరి ఆనందం ఎన్నాళ్లు నిలుస్తుంది..? తుమ్మల తన పూర్వవైభవాన్ని సాధించుకుంటారా..? తుమ్మల వ్యూహం టార్గెట్‌ను రీచ్‌ అవుతుందా..? అనేది ఇప్పుడు జిల్లా వాసుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle