newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

రూటు మార్చిన కేసీఆర్‌..! షాకులు తప్పవా?

23-12-201923-12-2019 13:36:48 IST
2019-12-23T08:06:48.310Z23-12-2019 2019-12-23T08:06:44.356Z - - 25-02-2020

రూటు మార్చిన కేసీఆర్‌..! షాకులు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్‌ రూట్‌ మార్చారు.. ఇన్నాళ్లూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాల వర్షం కురిపించిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆచుతూచి అడుగులు వేస్తున్నారు. ఆర్థిక మాద్యం దెబ్బతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుండటంతో ఖజానాను కాపాడుకొనేందుకు ప్రజలకు షాకులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆవిర్భావ సమయంలో మిగులు బ్జడెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రం క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దీనికి తోడు ఆర్థిక మాంద్యం ప్రభావంతో.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కేంద్రం కూడా ఇంతకు ముందులా నిధులు, పన్నుల వాటాను త్వరగా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కేసీఆర్‌ సర్కారు ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఫోకస్‌ పెట్టింది.

ఆర్టీసీ కార్మికులు 52రోజులపాటు సమ్మె చేసినప్పటికీ.. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్‌ ససేమిరా అంగీకరించలేదు. మీ అప్పులు, మీ తిప్పలు అని వదిలేశారు. వాళ్లంతట వాళ్లుగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ వదిలేశాక కొద్దిగా మెత్తబడ్డారు. సమ్మె విరమించిన కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకున్నప్పటికీ.. ఆర్టీసీ ఛార్జీలను పెంచి భారాన్ని ప్రజల మీద మోపారు. తద్వారా ఆర్టీసీ భారం ప్రభుత్వం మీద పడకుండా జాగ్రత్తపడ్డారు.

దీనికితోడు మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లిక్కర్‌ ధరలను పది శాతం చొప్పున పెంచారు. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు -రూ. 400 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. 2017లోనూ ప్రభుత్వం మద్యం ధరలను పది శాతం మేర పెంచింది.

భూముల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేసింది. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరిగాయి. నూతన జిల్లాల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడం.. హైదరాబాద్‌కు పరిశ్రమలు తరలి వస్తుండటంతో... రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వాటి రిజిస్ట్రేషన్‌ విలువను కూడా పెంచాలని కేసీఆర్‌ సర్కారు యోచిస్తోంది. రిజిస్ట్రేషన్‌ విలువను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు.

దీనికితోడు సీఎం కేసీఆర్‌ తీరు చూస్తుంటే.. ఈ నిర్ణయాలతోనే ఆగిపోయేలా కనిపించడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం.. ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ పొదుపు మంత్రాన్ని పటిస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో సమావేశాలు, సభల సమయంలో కేసీఆర్‌ వరాల జల్లు కురిపించిన ఘటనలు ఉన్నాయి. కానీ ప్రస్తుత సమయంలో కేసీఆర్‌ తన నోటిని అదుపులో పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ప్రజలపై మరిన్ని భారాలు మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle