రిపోర్టులు తారుమారు.. మారని ఉస్మానియా హాస్పిటల్ తీరు
18-07-202018-07-2020 17:05:56 IST
Updated On 18-07-2020 17:33:41 ISTUpdated On 18-07-20202020-07-18T11:35:56.805Z18-07-2020 2020-07-18T11:35:53.603Z - 2020-07-18T12:03:41.690Z - 18-07-2020

కరోనా పాజిటివ్ అని తెలియగానే ఎవరైనా కుంగిపోతారు. ఏమవుతుందేమోనని ఆందోళనకు గురవుతారు. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారైతే తీవ్ర మనోవేదనకు లోనవుతారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు కూడా ఇలాగే ఆందోళన చెందాడు. కానీ అనుమానం వచ్చి ప్రయివేట్ హాస్పిటల్లో టెస్టు చేయించుకోవడంతో నెగటివ్ అని రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వికారాబాద్ జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన మేఘనాథ్ గౌడ్ విద్యా వాలంటీర్. అనారోగ్యం కారణంగా జులై 3న ఉస్మానియా హాస్పిటల్లో చేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో.. వైద్య సిబ్బందికి అతడికి కరోనా పరీక్ష చేశారు. ఏడో తేదీ వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో మేఘనాథ్ తీవ్రంగా ఆందోళన చెందాడు. రిపోర్ట్‌ను సరిగా పరిశీలించగా.. ఫోన్ నంబర్, ఇంటిపేరు తప్పుగా ఉంది. దీంతో ఎందుకైనా మంచిదని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోగా.. కరోనా లేదని తేలింది. న్యుమోనియాతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఉస్మానియా హాస్పిటల్‌కు వెళ్లిన మేఘనాథ్ అన్నయ్య.. ఇదేంటని నిలదీయగా.. రిపోర్టులు మారాయని తాపీగా బదులిచ్చారు. సమయానికి సరైన చికిత్స అందకపోవడంతో.. ఆ యువకుడి ఆరోగ్యం క్షీణించింది. ప్రయివేట్ హాస్పిటల్లో ఇప్పటికే రూ.11 లక్షలు ఖర్చయిందని మేఘనాథ్ సోదరుడు తెలిపారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
13 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
17 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
15 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
20 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
19 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
18 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
a day ago
ఇంకా