newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

రిజర్వేషన్ల విధానంపై ఉత్తమ్ ఫైర్

26-12-201926-12-2019 17:20:19 IST
Updated On 27-12-2019 11:20:58 ISTUpdated On 27-12-20192019-12-26T11:50:19.413Z26-12-2019 2019-12-26T11:50:17.329Z - 2019-12-27T05:50:58.361Z - 27-12-2019

రిజర్వేషన్ల విధానంపై ఉత్తమ్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం వచ్చింది. ఏడాది క్రితం శాసనసభ ముందస్తు ఎన్నికల నుంచి ప్రారంభమయిన ఎన్నికల క్రతువు ఇంకా కొనసాగుతూనే వుంది. తాజాగా మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతూనే వున్నారు. ఒక్కరోజు ముందు రిజర్వేషన్లు ఇచ్చి.. రెండు రోజులు నామినేషన్‌ వెయ్యమనడం పద్ధతి ఎలా అవుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

ఓటర్ల జాబితా పూర్తికాకుండా షెడ్యూల్‌  ఎలా ఇస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇలాంటి విధానం ఎక్కడా లేదన్నారు ఉత్తమ్. రిజర్వేషన్ ప్రకటనకి నామినేషన్‌కు మధ్య కనీస సమయం ఇవ్వకపోతే ఎలా అన్నారు. అయితే, తాము ఎన్నికలను వాయిదా వేయమని కోరడం లేదన్నారు. ఎన్నికలు సరిగా నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బందులు కలగవన్నారు. ఇవాళ జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. దీంతో పాటు ఎన్ ఆర్ సీ, సీఏఏ ఆందోళనల గురించి నేతలు మాట్లాడారు.

రిజర్వేషన్లు ప్రకటించకుండానే మున్సిపల్‌ ఎన్నికలకు తమ అభ్యర్థులు సిద్ధమని కేటీఆర్‌ చెప్పడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వార్డులో ఏ రిజర్వేషన్ వుందో టీఆర్ఎస్ కు ముందే తెలిసిపోయి వుంటుందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కువ మునిసిపాలిటీలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ ధీమాతో వుంది.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను మరిచిపోయిందని, హామీలు గుర్తుకు రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలను కాంగ్రెస్ కోరింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా బీజేపీకి ఎప్పటికీ రాదని హుజూర్‌నగర్‌ ఎన్నికలతో తేలిపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలమయిన శక్తిగా ఎదుగుతోందంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle