newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్న తెలంగాణ!

12-02-202012-02-2020 12:52:59 IST
Updated On 12-02-2020 17:33:29 ISTUpdated On 12-02-20202020-02-12T07:22:59.086Z12-02-2020 2020-02-12T07:22:55.953Z - 2020-02-12T12:03:29.476Z - 12-02-2020

రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్న తెలంగాణ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఎగసిపడే సమయంలో మేధావులంతా చెప్పిన మాట విడిపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని. కొందరైతే పెట్టుబడి దారులు, మేధావులు, విద్యావేత్తలు, గోదావరి జిల్లాలలో నీటి సౌకర్యం, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, విద్యుత్ ఉత్పత్తి ఇలా అన్ని రకాలుగా అధికంగా ఉన్న ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతే తెలంగాణ వెనకబడే అవకాశాలున్నాయని అప్పుడు అంచనాలు వేశారు.

అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఈ అంచనాలన్నీ తల్లక్రిందులయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ప్రభుత్వంలోనే ఉన్న అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా తనకున్న స్థానిక పరిస్థితుల అవగాహనా ఆధారంగా ప్రజలను అభివృద్ధి వైపు మళ్లించారు. ఒక వైపు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ దెబ్బతినకుండా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

హైదరాబాద్ నగరంలో తలెత్తే మత వివాదాలను రాజకీయ సమీకరణలతో చెక్ పెట్టిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం, కుల వృత్తులపై ఫోకస్ పెంచారు. దీంతో హైదరాబాద్ నగరం బెస్ట్ సిటీగా రికార్డులను నమోదు చేస్తుంటే వచ్చిన ఆదాయంతో పల్లెలు, పట్టణాలను అభివృద్ధికి బాటలు వేస్తూ దూసుకెళ్తున్నారు. అలా తొలి ప్రభుత్వంలోనే వేసుకున్న ప్రణాళికలు అన్నీ విజయవంతమయ్యాయి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చకపోయినా కేసీఆర్ తనకున్న మాటల చాతుర్యంతో ఉన్న కొద్దిపాటి వ్యతిరేక ప్రచారాన్ని అధిగమించి రెండోసారి మళ్ళీ పీఠం దక్కించుకున్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో కూడా తొలి ప్రభుత్వంలో దాదాపుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నించగా.. కేసీఆర్ మాదిరి వ్యతిరేక ప్రచారాన్ని అధిగమించడంలో విఫలమయ్యారు.

దీంతో అక్కడ కొత్తగా జగన్ సర్కార్ కొలువుదీరడం.. పాత ప్రభుత్వంలో చేసిన వాటిని తిరగదోడడం, రాజకీయ ప్రతీకారం దిశగా చర్యలు, ఏకంగా రాజధాని మార్పులు, పీపీఏలపైనే సమీక్షలు, ఆక్రమణల పేరుతో కూల్చివేతలు, రద్దులు, రాయితీల తొలగింపు, కొరతలు, సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపులను వెనక్కి తీసుకోవడం వంటి అనిశ్చితి కారణాలు తెలంగాణ పాలిట వరంగా మారిపోయాయి.

తెలంగాణలో తొలి ప్రభుత్వంలో అతికష్టం మీద ఆకర్షణలు చేయాల్సి వస్తే ప్రస్తుతం గతంలో వేసిన బాటలు ఏపీలో పరిస్థితిలు అన్నీ కలిసి తెలంగాణలో అభివృద్ధి నల్లేరు మీద నడక మాదిరిగా మారిపోయింది. ఈక్రమంలో ప్రభుత్వం ఎక్కడా ప్రయత్నాలలో ఆగిపోకుండా ఇంకాస్త బూస్టింగ్ ఇచ్చే పనిలో ఉండడంతో తెలంగాణ రికార్డులను తిరగరాస్తుంది.

ఈమధ్యనే దేశంమొత్తం మీద ఉన్న సీసీ కెమెరాల ఏర్పాటులో అరవై ఐదు శాతం కెమెరాలు ఒక్క తెలంగాణలో ఏర్పాటు చేసిన ఘనత సొంతం చేసుకోగా ఇప్పటికే కృత్రిమ అడవుల సృస్టికారణ, హరిత హారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాలతో చేపట్టిన మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింద‌ని కేంద్ర అట‌వీ శాఖ గణాంకాలు వెల్లడించడం విశేషం. ఒకపక్క అభివృద్ధి పథంలో నడిపిస్తూనే పర్యావరణ, వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలను సమపాళ్ళలో మ్యానేజ్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుందనే చెప్పాలి.

 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle