newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రికవరీ భేష్.. కానీ తెలంగాణలో కరోనాపై అంచనాలు తప్పినట్లేనా?

14-09-202014-09-2020 09:04:29 IST
Updated On 14-09-2020 09:06:17 ISTUpdated On 14-09-20202020-09-14T03:34:29.985Z14-09-2020 2020-09-14T03:34:28.120Z - 2020-09-14T03:36:17.671Z - 14-09-2020

రికవరీ భేష్.. కానీ తెలంగాణలో కరోనాపై అంచనాలు తప్పినట్లేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకు పెరుగుతూ జాతీయ స్థాయిని మించిపోతున్నప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి పరిస్థితిని అంచనా వేయడటంలో పొరపాటు చేసిందా అని అనుమానులు బలపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల ఆగస్టు చివరి కల్లా గ్రేటర్‌  హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి వస్తుందనీ, కేసులు కొద్ది రోజుల్లో ఇంకా తగ్గుతాయినీ, సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైర్‌సకు చెక్‌ పడుతుందనీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆగస్టు 25న మీడియా సమావేశంలో చెప్పారు. 

కానీ ఆ అంచనాలు తలకిందులయినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఆగస్టు చివరి వారం నుంచి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను రెట్టింపు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. జనసంచారం ఒక్కసారిగా పెరగడం కూడా వైరస్‌ వ్యాప్తికి ఊతమిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 

కరోనా కేసులు ఏ మలుపు తీసుకోనున్నాయి? పెరుగుతాయా? తగ్గుతాయా? అనే దానిపై ఓ అంచనాకు వచ్చేందుకు ఆగస్టులో తొలి మూడు వారాల పాటు నమోదైన కేసుల తీరును వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. వాటి ప్రకారం.. తొలివారంలో 14,810 కేసులు రాగా, రెండోవారంలో కాస్త తగ్గి 12,746 పాజిటివ్‌లు వచ్చాయి. మూడో వారానికి వచ్చేసరికి కొంచెం పెరిగి 13,990కు చేరాయి. రాష్ట్రంలో బయటపడుతున్న పాజిటివ్‌ కేసులు ప్రాతిపదికగా సెప్టెంబరు చివరి వారం వరకు అదే ట్రెండ్‌ కొనసాగితే కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని రాష్ట్ర సర్కారు అంచనాకు వచ్చింది. 

ఆగస్టు మూడో వారం తర్వాత సీన్‌ మారింది. గత నెల 23 నుంచి రాష్ట్రంలో పరీక్షల సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. అప్పటివరకు రోజూ 20 వేల పరీక్షలే చేయగా సగటున 1,731 కేసులు వచ్చాయి. ఆగస్టు 23 నుంచి రోజుకు 40వేలకుపైగా టెస్టులు చేస్తూ... రెండు రోజుల వ్యవధిలోనే వాటిని 60 వేలకు పెంచారు. దీంతో అమాంతం కేసులు పెరిగిపోయాయి. సెప్టెంబరు మొదటి వారంలోనూ 19,945 పాజిటివ్‌లు రాగా, రోజుకు సగటున 2,493 కేసులు నమోదయ్యాయి. 

పాజిటివ్ కేసులు 2,216.. మృతులు 11 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకూ పెరుగుతోంది. సరిగ్గా నెల క్రితంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగుపడింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత నెల 12న కరోనా నుంచి కోలుకున్నవారి రేటు 72.93 శాత ముంటే, ఈ నెల 12వ తేదీన 79.2 శాతానికి (దాదాపు 80 శాతం) పెరిగింది. ఇది మంచి పరిణామమని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

గత నెల అదే తేదీన కరోనా మరణాల రేటు 0.76 శాతముంటే, ఇప్పుడు 0.61 శాతానికి తగ్గడం గమనార్హం. వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 1,57,096 కరోనా కేసులు నమోదైతే, అందులో 1,24,528 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 961కి చేరుకుంది. ఇక ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,607 కాగా, అందులో ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో 24,674 మంది ఉన్నారు. 

రాష్ట్రంలో శనివారం 56,217 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 2,216 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా కరోనాతో 11 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 21,34,912కి చేరింది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 341 వచ్చాయి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్‌ జిల్లాలో 148, నల్లగొండ జిల్లాలో 126, కరీంనగర్‌ జిల్లాలో 119, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 102, ఖమ్మం జిల్లాలో 105 కరోనా కేసులు నమోదయ్యాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle