newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

రాహుల్ గాంధీతో మోడీకి పోలికేంటి?

18-05-201918-05-2019 16:37:29 IST
Updated On 27-06-2019 15:38:20 ISTUpdated On 27-06-20192019-05-18T11:07:29.048Z18-05-2019 2019-05-18T11:07:24.840Z - 2019-06-27T10:08:20.338Z - 27-06-2019

రాహుల్ గాంధీతో మోడీకి పోలికేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పూటకో మాట, గంటకో హామీ ఇచ్చి నెరవేర్చని మోడీకి, నిజాయితీకి కట్టుబడే రాహుల్ గాంధీకి పోలికేంటి అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మల్లురవి. ఎన్నికలు ప్రారంభం కాకుండానే అన్ని పార్టీలతో కలిసి తాము ప్రధాని అభ్యర్ధిని ఎంపిక చేస్తామని చెప్పారని, ఎన్నికలు ముగిసేవేళ అదేమాటకు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ లభిస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చిస్తామన్నారు.

దళితులపై దాడి, పుస్తక రచయిత భావప్రకటనా స్వేచ్ఛపై దాడి వంటి అంశాలపై మోడీ ఎందుకు మాట్లాడం లేదన్నారు. ప్రధాని మోడీ ప్రెస్ మీట్ ఆయనలోని అహంకారాన్ని చూసిందన్నారు. మోడీ తాను చెప్పదలుచుకున్నది చెప్పారని, మీడియా ప్రశ్నలకు మాత్రం సమాధానం దాటవేశారని, అమిత్ షా వైపు నెట్టేశారని అన్నారు.

ఎన్నో ప్రశ్నలకు ప్రధాని మోడీ నుంచి సమాధానం రాబట్టాలని మీడియా మిత్రులు ఆశించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, తాము సాగించిన ఎన్నికల ప్రచారం తీరు గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు.

ప్రతి ప్రశ్నకు ప్రధాన మంత్రియే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆయన పక్కనే కూర్చున్న పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాయే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు రవి ప్రస్తావించారు. 

ఎన్నికలు ముగియకుండానే తమకు 300 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలుగుతారని మల్లు రవి ప్రశ్నించారు. మోడీ గోడమీద పిల్లి వాటంలా మారారని, భాగస్వామ్యపార్టీల విషయంలో ఆయన ఇదే ధోరని అనుసరిస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికలు దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయన్నారు. ప్రజలు మార్పుకోసం చూస్తున్నారని, మోడీని ఇంటికి పంపడం ఖాయం అన్నారు మల్లు రవి.

ఇదిలా ఉంటే మోడీ ప్రెస్ మీట్ పై రాహుల్ గాంధీ తనదైన రీతిలో స్పందించారు. ‘‘మోదీ జీ అభినందనలు. మీ విలేకరుల సమావేశం అద్భుతంగా ఉంది. సగం యుద్ధం చేశారు. వచ్చేసారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం అమిత్‌ షా మీకివ్వొచ్చు. బాగుంది’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle