newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ పట్టు... జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి!

23-09-202023-09-2020 09:10:04 IST
Updated On 23-09-2020 10:16:20 ISTUpdated On 23-09-20202020-09-23T03:40:04.554Z23-09-2020 2020-09-23T03:40:01.037Z - 2020-09-23T04:46:20.411Z - 23-09-2020

రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ పట్టు... జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పట్టు సడలకుండా ఆయన కుమారుడు దూకుడు పెంచారు. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి క్షేత్ర స్థాయి నుంచీ బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కేటీఆర్ ఇప్పుడు జీహెచ్ఎంసీ, మునిసిపల్, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ విజయానికి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఓటరు నమోదు నుంచి ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తూ పార్టీ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో ప్రచార సారథ్యం విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ కేసీఆర్ కుమారుడిగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడిగా కూడా పార్టీ క్యాడర్ నమ్మకాన్ని చూరగొన్నారు.

గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే తెరాస అధినేత జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయనున్నట్లు విస్పష్టంగా చెప్పారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నదని గతంలోనే విమర్శించిన కేసీఆర్ కు అప్పట్లో జాతీయ స్థాయిలో అవసరమైన మద్దతు లబించలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు విద్యుత్, వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు...జీఎస్టీ బకాయిల విషయంలో రాష్ట్రాలను ఆర్థిక అగాథంలోనికి తోసిన పద్ధతిలతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిపై విస్తృత చర్చ జరుగుతోంది. సంక్షేమ, అభివృద్ది పథకాలలో కేసీఆర్ విధానాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో అందరి దృష్టీ కేసీఆర్ పై పడింది.

ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తే అనుసరించి మద్దతుగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితులలోనే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన ఆయన కుమారుడు కేటీఆర్ తెరాసపై పూర్థి స్థాయిలో పట్టు సాధించేలా ఒకదాని వెంట ఒకటిగా బాధ్యతలు చేపడుతూ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినా రాష్ట్రంలో పార్టీ కేడర్, పార్టీ బలం చెక్కు చెదరకుండా చూస్తున్నారు. అందుకే కేసీఆర్ కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా తన గొంతు బలంగా వినిపించగలుగుతున్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును ఇష్టం ఉన్నా లేకున్నా 28 రాష్ట్రాలు అంగీకరిస్తే... తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం వ్యతిరేక గళాన్ని గట్టిగా వినిపించారు.

విద్యుత్, వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టడానికి ఇదే అదునని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఎన్డీయే,యూపీయేలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటా లేదా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటా అన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేకపోయినా.. కేంద్రంలో మోడీని ఢీ కొనే బలమైన నేతగా కేసీఆర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నది మాత్రం వాస్తవం. అలాగే ఆయన జాతీయ స్థాయి రాజకీయాలలో బిజీ అయినా రాష్ట్రంలో పార్టీకి సమర్థ నాయకత్వాన్ని అందించగలరన్న విశ్వాసాన్ని కేటీఆర్ కేడర్ లో కలిగించగలిగారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle