newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

రాష్ట్రాల ఖజానాలు ఖాళీ- పాలకుల నిర్వాకమే కారణం!

21-10-201921-10-2019 16:29:20 IST
Updated On 21-10-2019 16:39:54 ISTUpdated On 21-10-20192019-10-21T10:59:20.823Z21-10-2019 2019-10-21T10:59:17.320Z - 2019-10-21T11:09:54.567Z - 21-10-2019

రాష్ట్రాల ఖజానాలు ఖాళీ- పాలకుల నిర్వాకమే కారణం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల్లో హామీలు ఇచ్చేయడం, విజయమే లక్ష్యంగా ఉచితాలు ఇచ్చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాకా వాటి అమలు కోసం ప్రజా ధనాన్ని పందేరం చేయడం ఆనవాయితీగా మారిపోవడమే రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అవ్వడానికి కారణం. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో అధికారంలోనికి రావడమే లక్ష్యంగా చేస్తున్న పనులు...ప్రగతికి అవరోధంగా మారుతున్నాయి  ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బులును అధికారంలోనికి వచ్చిన పార్టీలు మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యయం చేస్తుండటం...రాష్ట్రాల అభివృద్ధికి అవరోధంగా మారింది. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే...ఈ రాష్ట్రాల అభివృద్ధి తిరోగమన దిశలో నడవడం ఖాయమనిపించక మానదు. పాలనంటే  అంటే...ప్రజాధనాన్ని ఓట్ల కోసం పందేరం చేయడమేనన్న చందంగా తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ లు వ్యవహరిస్తున్నారు. ఏపీలో జగన్ వివిధ వర్గాలకు ఆయాచితంగా సొమ్ములు పందేరం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంటే...తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఉచిత పందేరాల కోసం అప్పులు చేయడమే మార్గంగా పాలన సాగిస్తున్నారు  దీంతో జనాలకు ఉపాధి చూపే  కార్యక్రమాలు మూలన పడ్డాయి. 

ఇక ప్రాంతీయ పార్టీల పోటీని తట్టుకుని రాష్ట్రాలలో అధికారంలోనికి రావడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే దారిలో నడుస్తున్నది. ఉచిత తాయిలాల హామీలను గుప్పించే విషయంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు.  ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తట్టుకోవడానికి జాతీయ పార్టీలు కూడా హావిూల విషయంలో పోటీపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఇష్టం వచ్చినట్లుగా హావిూలు గుప్పించి ఖాళీ చేస్తున్న తీరు ఆందోళనకర స్థాయికి చేరుకుంది. 

కులాల పేరుతో, వర్గాల పేరుతో పందేరాల తీరు...భవిష్యత్ పై ఆందోళన కలిగించక మానదు. ఎపిలో ఆర్టీసీ విలీనం చేయడాన్ని ఆదర్శంగా చూపి తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా సంక్షేమం పేరిట నగదు పందేరంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి విధానాలు రాష్ట్రాలు  ఆర్థికంగా దివాలా తీయడానికే దోహదపడతాయి తప్ప అభివృద్ధికి ఎంత మాత్రం ఉపయోగపడవు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలతో పథకాలను చేపట్టి ఖజానా ఖాళీ అవ్వడంతో నెపం ఆర్థిక మాంద్యంపై నెట్టేస్తున్నారు.     

ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతం చెల్లించడానికి కూడా సంస్థ వద్ద డబ్బుల్లేవని హైకోర్టు ధర్మాసనం చెప్పే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. రైతుబంధు పథకం అమలు సందిగ్ధంలో పడింది. ఇక రెవెన్యూ లోటుతో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజాధనాన్ని వివిధ పథకాల పేరిట పంచిపెడుతూ పోతున్నారు. అప్పులు చేసి మరీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు పరిస్థితిని గమనిస్తే ముందు ముందు ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండని పరిస్థితి తలెత్తడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

ఓట్ల కోసం ప్రజాధనాన్ని అప్పనంగా పందేరం చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. ప్రజలెన్నుకున్నది...కొందరికి ఉచితంగా సొమ్ము పందేరం చేసి ప్రజలందరినీ కష్టాల్లోకి నెట్టేస్తారని కాదు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూడా ఇదే విధంగా హామీలను గుప్పించేసింది. హామీలను గుప్పించడమే కాదు...వాటికి బడ్జెట్ ఎలా కేటాయిస్తారో కూడా మేనిఫెస్టోల్లో వివరించేలా నిబంధనలు తీసుకు రావలసిన అవసరం ఉంది. ఇటువంటి పందేరాల వల్లే హంగర్ ఇండెక్స్ లో భారత్ దిగువ నుంచి దాదాపు ప్రథమ స్థానంలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే...ముందు ముందు దేశంలో ఆకలి కేకలు తప్ప మరేవీ వినిపించని పరిస్థితి తలెత్తినా ఆశ్చర్య పోనవసరం లేదు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle