newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాముల‌మ్మ మాట‌.. ఇక స్పీడ్ పెంచుతార‌ట‌..!

27-02-202027-02-2020 08:40:02 IST
2020-02-27T03:10:02.249Z27-02-2020 2020-02-27T03:06:07.941Z - - 15-04-2021

రాముల‌మ్మ మాట‌.. ఇక స్పీడ్ పెంచుతార‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ న‌టి, తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆరేళ్లు పూర్త‌య్యాయి. ఈ విష‌యాన్ని ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మ‌హేశ్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాలో కీరోల్‌లో న‌టించిన విజ‌య‌శాంతి ఇక రాజ‌కీయాల‌కు స్వ‌స్థి పలికిన‌ట్లేన‌ని అంతా అనుకున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి కూడా అంత బాగోలేక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఆమె ఇక పాలిటిక్స్‌లో యాక్టీవ్‌గా ఉండ‌ర‌ని అనుకున్నారు.

త‌ల‌పండిన కాంగ్రెస్ నేత‌లు అధికార టీఆర్ఎస్ దూకుడును త‌ట్టుకోలేమ‌ని సైలెంట్ అయిపోతున్నారు. కాంగ్రెస్‌లో సీఎం క్యాండిడేట్లుగా చెప్పుకునే వారే స్వంత నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా క‌నిపించ‌డం లేదు. ఈ స‌మయంలో విజ‌య‌శాంతి కూడా మ‌ళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అయ్యారు. కానీ, ఆమె సినిమాల్లో న‌టిస్తూనే రాజ‌కీయాలు చేయాల‌ని, గ‌తంలో కంటే చురుగ్గా రాజ‌కీయం చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ విష‌యాన్ని కూడా ఆమెనే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో విజ‌య‌శాంతి త‌న‌వంతు పాత్ర పోషించారు. సినిమాల్లో త‌న హ‌వా న‌డుస్తున్న రోజుల్లోనే ఆమె సినిమాలు వ‌దులుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ఒక దశ‌లో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ఎస్‌లానే చురుగ్గా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కానీ, ఆమెకు రాజ‌కీయం ఏ మాత్రం క‌లిసిరాలేదు. కేసీఆర్ పిలుపుమేర‌కు త‌న పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు విజ‌య‌శాంతి.

టీఆర్ఎస్ త‌ర‌పున 2009లో మెద‌క్ ఎంపీగా గెలిచి పార్టీలో నెంబ‌ర్ 2గా కూడా వ్య‌వ‌హ‌రించారు. అయితే, క్ర‌మంగా ఆమె పార్టీకి దూర‌మ‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌క‌ట‌న‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు రాజ‌కీయంగా క‌లిసి రాలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఆమె మెద‌క్ అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే విజ‌య‌శాంతి మంచి స్థానంలో ఉంటార‌ని భావించారు. కానీ, ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమె కూడా ఓట‌మి పాల‌య్యారు.

త‌ర్వాత నాలుగేళ్ల పాటు రాజ‌కీయాల ప‌ట్ల‌, కాంగ్రెస్ ప‌ట్ల అంటీముట్ట‌ని వైఖ‌రితో ఆమె వ్య‌వ‌హ‌రించారు. 2018 ఎన్నిక‌ల ముందు ఆమెకు కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది అధిష్ఠానం. ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా తిరిగి పార్టీ కోసం ప్ర‌చారం చేశారామె. ఆమె కూడా పోటీ చేయ‌కుండా పార్టీని గెలిపించేందుకు ప్ర‌చారం చేసినా పార్టీ ఓడిపోయింది. దీంతో మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. అప్పుడ‌ప్పుడు ట్వీట్లు మిన‌హా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు.

అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఎలా జ‌రిగినా ఇప్ప‌టి నుంచి యాక్టీవ్ కావాల‌ని విజ‌య‌శాంతి నిర్ణ‌యించారు. సినిమాల్లో న‌టిస్తూనే రాజ‌కీయ‌, పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు కొంత వెన‌క‌బ‌డ్డ‌ట్లు కూడా చెప్పిన ఆమె ఇక నుంచి స్పీడ్ పెంచుతాన‌ని చెప్పారు. మ‌రి, విజ‌య‌శాంతి అటు సినిమాల‌ను, ఇటు రాజ‌కీయాల‌ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle