newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

రాజ‌గోపాల్ రెడ్డికి రూట్ తెలియ‌డం లేదా..?

02-12-201902-12-2019 08:34:51 IST
2019-12-02T03:04:51.237Z02-12-2019 2019-12-02T02:43:59.006Z - - 25-02-2020

రాజ‌గోపాల్ రెడ్డికి రూట్ తెలియ‌డం లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల్లో ముందుంటారు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాల్లో వీరిది కీల‌క పాత్ర‌. అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేయి ప‌ట్టుకొని 2009లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాజ‌గోపాల్ రెడ్డి ప‌దేళ్ల పాటు అన్న వెంటే న‌డిచాడు. ఇద్ద‌రూ క‌లిసి జిల్లాలో చ‌క్రం తిప్పారు.

అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఒక్క‌తాటిపై న‌డిచారు. ఇప్పుడు మాత్రం వీరిద్ద‌రూ రాజ‌కీయంగా విడిపోయారు.

కోమ‌టిరెడ్డి సోద‌రులు ఎప్పుడూ ప్ర‌జాప్ర‌తినిధులుగా కొన‌సాగుతున్నారు. 2014లో భువ‌న‌గిరి ఎంపీగా రాజ‌గోపాల్ రెడ్డి ఓడిపోగానే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న గెలుపులో వెంక‌ట్‌రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 2018లో న‌ల్గొండ ఎమ్మెల్యేగా వెంక‌ట్‌రెడ్డి ఓడిపోయాక భువ‌న‌గిరి ఎంపీగా గెలిచారు.

ఈయ‌న గెలుపులో త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డిది కీల‌క పాత్ర‌. ఇలా అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క‌లిసి మెలిసి జిల్లాలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఉమ్మ‌డి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వీరికంటూ ప్ర‌త్యేకంగా వ‌ర్గం ఉంది.

త‌మ సోద‌రుల్లో ఎవ‌రికో ఒక‌రికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తార‌ని కోమ‌టిరెడ్డి సోద‌రులు ఆశించారు. ఎంత‌కూ వారికి ఈ ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో వెంక‌ట్‌రెడ్డి ఓపిక‌గా ఇంకా ఎదురుచూస్తున్నారు. కానీ, రాజ‌గోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌తో విభేదించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాహుల్ గాంధీ విమ‌ర్శించి, న‌రేంద్ర మోడీని కీర్తించారు. బీజేపీలో చేరేందుకు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు.

ఈ తతంగ‌మంతా జ‌రిగిన నాలుగైదు నెల‌లైతోంది. అప్పుడే ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతార‌ని అంతా భావించినా ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

కాంగ్రెస్‌ను విమ‌ర్శించిన ఆయ‌న ఆ పార్టీ కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొన‌డం లేదు. సీఎల్పీ స‌మావేశాలకు కూడా హాజ‌రుకావ‌డం లేదు. ఇక‌, బీజేపీలో చేరేందుకు కూడా ఆయ‌న వెన‌క‌డుగు వేస్తున్నారు.

బీజేపీలో చేరితే వెంట‌నే ఎమ్మెల్యే ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో రాజ‌గోపాల్ రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక‌, కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛ, అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం బీజేపీలో ఉండ‌వు. కాంగ్రెస్‌లో ఎప్పుడు, ఏది మాట్లాడినా, స్వంత పార్టీ వారినే ఎదురించినా న‌డుస్తుంది. కానీ, బీజేపీలో అలా కాదు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేత‌లు కూడా అంత యాక్టీవ్‌గా లేరు. దీనికి తోడు న‌ల్గొండ జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం బ‌లం లేదు. పైగా త‌న క్యాడ‌ర్ కూడా బీజేపీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా లేన‌ట్లు రాజ‌గోపాల్ రెడ్డి గ్ర‌హించారు.

దీంతో అప్పుడే ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న సోద‌రుడు వెంక‌ట్‌రెడ్డి పీసీసీ రేసులో ముందున్నారు. ఈ ప‌ద‌వి కోసం ఆయ‌న పేరును అధిష్ఠానం సీరియ‌స్‌గానే ప‌రిశీలిస్తోంది.

ఒక‌వేళ వెంక‌ట్‌రెడ్డికి ఈ ప‌ద‌వి ఇస్తే రాజ‌గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉంది. లేక‌పోతే అటు కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేక‌, బీజేపీలోకి వెళ్ల‌లేక మ‌రో మూడేళ్లు స‌త‌మ‌తం కావాల్సిందే. కానీ, ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు రాజ‌కీయంగా వేర‌వ‌డంతో జిల్లాలో, పార్టీ క్యాడ‌ర్‌లో వీరి ప‌ట్టు స‌డ‌లుతోంది.

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle