newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

13-07-202013-07-2020 08:35:53 IST
Updated On 13-07-2020 09:29:14 ISTUpdated On 13-07-20202020-07-13T03:05:53.607Z13-07-2020 2020-07-13T03:05:45.400Z - 2020-07-13T03:59:14.483Z - 13-07-2020

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్‌భవన్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో 398మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28మంది పోలీసు సిబ్బందికి, 10మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి, 10 మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 347 మంది సిబ్బందికి కరోనా నెగిటివ్ అని తేలింది. 

కరోనా పరీక్షల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌, ఇతర సీనియర్‌ అధికారులకు నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా రెడ్‌జోన్లో కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవారు కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని గవర్నర్‌ తమిళి సై ప్రజలకు సూచించారు.

ప్రారంభంలోనే పరీక్షలు చేసుకుంటే మనల్నే కాకుండా చాలామందిని కాపాడుకునే అవకాశం ఉంది. గాభరా పడవద్దు. మీరు ముందుగా పరీక్ష చేసుకోండి. ఇతరులకు ప్రేరణ ఇద్దాం అని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు.

35 వేలకు చేరువగా కరోనా కేసులు.. తెలంగాణలో 1,269 నమోదు, 8 మంది మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 1500ల్లోపే కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 35 వేలకు చేరువయ్యాయి. ఆదివారం కొత్తగా 1,269 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. వీటిలో 11,883 యాక్టివ్‌ కేసులు కాగా, 22,482 మంది కోలుకున్నారు. 

కరోనా బారినపడి ఆదివారం 8 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 356కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,70,324 పరీక్షలు చేయగా, 1,35, 653 మందికి నెగెటివ్‌ వచ్చింది. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు.

తాజాగా 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఆదివారం 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. 

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అధికంగా జీహెచ్‌ఎంసీలో 800, రంగారెడ్డి 132, మేడ్చల్‌ 94, సంగారెడ్డి 36, కరీంనగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 23 చొప్పున నమోదయ్యాయి. ఇంకా మహబూబ్‌నగర్‌ 17, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో 15 చొప్పు న, మెదక్‌ 14, వరంగల్‌ అర్బన్‌ 12, నిజామాబాద్‌ 11, పెద్దపల్లి 9, మహబూబాబాద్‌ 8, యా దాద్రి, సూర్యాపేట, గద్వాలలో 7 చొప్పున, వికా రాబాద్, జనగామలో 6 చొప్పున, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్‌లో 4 చొప్పున, మంచిర్యాల, కొత్తగూడెం, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 3 చొప్పున, వరంగల్‌ రూరల్‌లో 2, ఖమ్మంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle