newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

22-02-202022-02-2020 13:34:22 IST
2020-02-22T08:04:22.096Z22-02-2020 2020-02-22T08:04:17.541Z - - 11-04-2021

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రాజ్యసభ నుండి రెండు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఒకటి టీఆర్ఎస్ పార్టీ సిటింగ్ సీట్. టీఆర్ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కే కేశవరావుది కాగా రెండోది పార్టీ బలం ఆధారంగా లభిస్తుంది.  దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ మనసులో ఎవరున్నారు? ఆశావాహులెవరు? అన్న ఆసక్తి పార్టీ వర్గాలలో తీవ్రంగా కనిపిస్తుంది.

పదవి కాలం పూర్తిచేసుకుంటున్న కేకేకు మరోసారి అవకాశం ఉంటుందా? అనే అనుమానం మొదటగా వినిపిస్తుంది. ఆ మధ్య ఆర్టీసీ ఉద్యమం సమయంలో కేకే వైఖరిపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తుంది. అప్పటి నుండే కేసీఆర్‌ కేకేను కాస్త దూరం పెడుతున్నారని .. దీంతో మరోసారి ఆయనకు అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రెండోస్థానం విషయానికి వస్తే ఇందుకు భారీగా పోటీ కనిపిస్తుంది. ఇది సీఎం ఇంటి నుండే మొదలైన పోటీ.. సీనియర్ నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు ఎందరి మధ్యనో పోటీగా కనిపిస్తుంది. మాజీ ఎంపీ కవితను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ ఇంటి నుండే బలంగా వినిపిస్తోందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఒకవేళ రాజ్యసభకి మిస్ అయితే మండలికి పంపి మంత్రి చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు.

ఇక అభ్యర్థుల జాబితాలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నేత విఠల్‌ రేసులో ఉండగా వీరికి తోడు మరో ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు కూడా పెద్దల సభకు వెళ్లేందుకు ఆరాటపడుతున్నారట. మరోవైపు కేటీఆర్ వర్గంలో కొందరు కూడా బెర్త్ పై ఆశ పడుతుండడం వినిపిస్తుంది.

కాగా, వీరిలో ఒకరికి ఏపీ నుండి ఎన్నిక చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లుగా చెప్తున్నారు. ఏపీ నుండి నాలుగు స్థానాలు ఉండగా ఒకటి తమకి దక్కేలా గులాబీ బాస్ మంతనాలు నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిని సాకుగా చూపి ముందు రాజసభ వ్యవహారాన్ని ముగించాలని చుపిస్తున్నట్లుగా తెలుస్తుంది.

కాగా, ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాలు కూడా ముందు నుండి పార్టీకి కావాల్సిన నేతలవే కావడంతో అది కూడా చిక్కు ముడిగానే కనిపిస్తుంది. అయితే ప్రత్యేక వ్యూహకర్తగా పేరున్న సీఎం కేసీఆర్ ఈ ఎంపికను ఎలా పరిష్కరిస్తారోనని రాజకీయ వర్గాలలో ఆసక్తిగా ఉండగా కేటీఆర్ అభిప్రాయం ఎంతవరకు ఉండనుందని మరోవైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle