newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

రాజా సింగ్‌కు స్వంత పార్టీలోనే శ‌త్రువులా..?

06-12-201906-12-2019 13:20:12 IST
Updated On 06-12-2019 17:42:20 ISTUpdated On 06-12-20192019-12-06T07:50:12.365Z06-12-2019 2019-12-06T07:50:07.967Z - 2019-12-06T12:12:20.332Z - 06-12-2019

రాజా సింగ్‌కు స్వంత పార్టీలోనే శ‌త్రువులా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌కు ఇప్పుడు స్వంత పార్టీలోనే శ‌త్రువులు త‌యార‌య్యారు. పార్టీలో పెద్ద‌లుగా ఉన్న వారే త‌న‌కు చెక్ పెడుతున్నార‌ని ఆయ‌న భావిస్తున్నారు. త‌న‌కు త‌గిన గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని రాజాసింగ్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాల‌ను ఆయ‌న బాహాటంగానే చెప్ప‌డంతో రాష్ట్ర బీజేపీలో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు ఉన్నా అంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌రు. కానీ, రాజాసింగ్ మాత్రం బాహాటంగానే పార్టీలో ప‌రిణామాల‌పై త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. ముఖ్యంగా ఆయ‌న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నారు. కిష‌న్ రెడ్డితో ఆయ‌న‌కు ముందునుంచీ మంచి సంబంధాలు లేవు. గ‌తంలోనూ కిష‌న్‌రెడ్డి వైఖ‌రిని రాజాసింగ్ త‌ప్పుబ‌ట్టారు.

కేంద్ర‌మంత్రిగా తెలంగాణ‌లో కిష‌న్‌రెడ్డి బీజేపీకి కీల‌క నేత‌గా ఉన్నారు. అయితే, ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేద‌ని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. గ‌తంలో బండారు ద‌త్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తే త‌న‌కు స‌మాచారం ఇచ్చేవార‌ని, ఇప్పుడు మాత్రం ఆ ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

గ‌త అసెంబ్లీలో కిష‌న్ రెడ్డి బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు కూడా త‌న‌కు అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం రావ‌డం లేద‌ని రాజాసింగ్ ఆరోపించారు. అంతకుముందు కిష‌న్‌రెడ్డి బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కూడా త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న‌పై రాజాసింగ్ నేరుగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. వాస్త‌వానికి కిష‌న్‌రెడ్డి అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం, రాజాసింగ్ గోషామ‌హాల్ నియోజ‌క‌వ‌ర్గాలు ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న వీరిద్ద‌రికీ మాత్రం స‌యోధ్య లేదు.

ఇక‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కూడా త‌ను ఎంపీలు బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్ పేర్ల‌ను ప్ర‌తిపాదిస్తున్నారు. ఓ వైపు ల‌క్ష్మ‌ణ్ మ‌రోసారి ఈ ప‌ద‌విలో కొన‌సాగాల‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు కోరుతుండ‌గా రాజాసింగ్ మాత్రం వీరిద్ద‌రి వైపు మొగ్గు చూపుతున్నారు. ల‌క్ష్మ‌ణ్‌పైన కూడా రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నందునే కొత్త వారి పేర్ల‌ను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బండి సంజ‌య్‌, అర్వింద్‌తో త‌న‌కు స‌ఖ్య‌త ఉంది. రాజాసింగ్ బాహాటంగానే త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్క‌డంతో రాష్ట్ర బీజేపీలో అంత‌ర్గ‌తంగా నేత‌ల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   11 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   15 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   16 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   16 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   16 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   17 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   17 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   17 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle