newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కలకలం

10-04-202010-04-2020 11:56:41 IST
Updated On 10-04-2020 12:28:48 ISTUpdated On 10-04-20202020-04-10T06:26:41.396Z10-04-2020 2020-04-10T06:26:25.566Z - 2020-04-10T06:58:48.958Z - 10-04-2020

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజన్న సిరిసిల్ల జిల్లాకు కరోనా పాకింది. జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. వేములవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు మన జిల్లా లో వేరే వేరే దేశాల నుండి వచ్చిన 1032 మంది ని గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగిందని పోలీసులు తెలిపారు. విదేశాలనుంచి వచ్చిన వారికి జియోటాగ్ చేసి వారిని ప్రత్యేక బృందాలు రోజు తనిఖీ చేస్తున్నాయి.

ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారికి మరియు వేరే జిల్లా లో కరోనా పాజిటివ్ ఉన్న వారితో మన జిల్లాలో ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అని తెలుసుకుని వారిని గుర్తించడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 4000 మంది వలస కార్మికులను గుర్తించడం జరిగింది. వలస కార్మికులకి కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఇక్కడ పనులు చేసే వీలు లేక సొంత రాష్ట్రానికి వెళ్లడానికి వాహనాలు లేక ఇక్కట్ల పాలవుతున్నారు.

తినేందుకు సరుకులు కొనే స్తోమత లేక ఇబ్బంది పడుతున్న 4000 మంది వలస కార్మికులకి తినడానికి నిత్యావసర సరుకులు మరియు ఉండటానికి వసతి ఏర్పాటు చేశామని డీఎస్పీ చెప్పారు.జిల్లా బార్డర్ లలో 5 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని వీటితో పాటు జిల్లాలో కొన్ని పికెట్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.. ఈ చెక్ పోస్ట్ లు మరియు పికెట్లు డ్యూటీ నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలు డ్యూటీలో ఉంటారని చెప్పారు.

ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వివిధ షాప్ ల పై 54 కేసులు పెట్టామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన  367 వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని రేషన్ షాప్ ల ముందు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు  ధరల పట్టిక పెట్టాలని సూచించామన్నారు.. బ్లాక్ మార్కెట్ జరగకుండా జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ బృందాలుగా ఏర్పడి అన్ని మండలాల్లో తనిఖీ చేస్తున్నాయి. 

ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అన్నీ పూర్తిగా మూసి ఉంటాయి.. ఆ సమయంలో ఎవరూ బయటకు రావద్దని చెప్పారు. మెడికల్ ఎమర్జెన్సీ, మరియు నిత్యవసర వస్తువులు తప్ప మిగతా అన్ని దుకాణాలు షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ ముందు భాగంలో నీళ్ళు హ్యాండ్ వాష్ సబ్బులు, డెటాల్  బాటిల్స్  హాండ్ సానిటీజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.బ్లూ కోల్డ్స్, పెట్రోల్ కార్ సిబ్బంది, రిసెప్షన్, మరియు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ప్రజల్లోకి వెళ్లేటప్పుడు రోడ్డుపై వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని  డీఎస్పీ సూచించారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle