newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

రాజన్న సన్నిధిలో కేసీయార్.. గోదావరికి జలహారతి

30-12-201930-12-2019 16:07:16 IST
2019-12-30T10:37:16.556Z30-12-2019 2019-12-30T10:36:57.252Z - - 22-02-2020

రాజన్న సన్నిధిలో కేసీయార్.. గోదావరికి జలహారతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. తొలుత ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోశ్ కుమార్‌… కుటుంబ సమేతంగా రాజన్న దర్శనం చేసుకున్నారు. 

జిల్లా పర్యటనలో భాగంగా కేసీయార్ మిడ్‌మానేరు డ్యాంని నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు గోదావరికి హారతి ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 9వ ప్యాకేజీ పూర్తి అయ్యాక మిడ్‌మానేరు ప్రాజెక్టులో తొలిసారిగా పూర్తిస్థాయిలో నీటిని నింపారు. అయితే ప్రాజెక్టు పూర్తి అయ్యాక లీకేజీ ఏర్పడ్డంతో మరమ్మత్తులు చేశారు. మిడ్‌మానేరు నీటితో 2.35 లక్షల ఎకరాల పంట సాగులోకి రానుందని అధికారులు తెలిపారు. కేసీయార్ వెంట మంత్రులు కేటీయార్, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ ఉన్నారు. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

Image may contain: 1 person, standing, sky and outdoor

Image may contain: 2 people, sky, outdoor, water and nature

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle