newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

రాజకీయాలు కాదు.. మాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

21-03-202021-03-2020 18:06:25 IST
2020-03-21T12:36:25.648Z21-03-2020 2020-03-21T12:36:23.325Z - - 27-05-2020

రాజకీయాలు కాదు.. మాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమకు రాజకీయాలకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ కరోనా నివారణకు బార్లు, స్కూళ్ళు మూయిస్తే ఆయన కూతురు మాత్రం ఎన్నికల కోసం క్యాంపు నిర్వహించటం దురదృష్టకరం అన్నారు. ఆ క్యాంపులో పలువురి సభ్యులకు అనారోగ్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్‌కి మెజారిటీ ఉంటే క్యాంపు రాజకీయాలు చేయటం కవిత అసహనానికి నిదర్శనం అన్నారు. 

కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు చేయటం సిగ్గు చేటన్నారు. ఒక వైపు ప్రధాని కర్ఫ్యూ అంటుంటే టీఆరెస్ మాత్రం క్యాంపు పేరుతో ప్రజాప్రతినిధుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని, టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై కేసీఆర్ స్పందించాలన్నారు. రేపటి జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలని, కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని, ప్రపంచ అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఎంపీ అరవింద్. 

ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయని, అంతా జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. మన కంటే ఇతర దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వెనుకబడ్డాయి.కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల మన దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని, కరోనా నివారణ చర్యల్లో మోడీని ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయన్నారు. పార్లమెంటు సభ్యులు సైనికులుగా పోరాడాలని మోడీ మాకు సూచించారని, కరోనా విషయంలో మన  దేశ మీడియా అవగాహన కల్పించిన తీరు అద్భుతమని మోడీ అన్నారన్నారు. 

అందరూ ఇంట్లోనే ఉండాలి, అత్యవసర పరిస్థితులుంటేనే బయటికి రండి..ఏప్రిల్ 15 వరకు అందరు ఆత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. జనతా కర్ఫ్యూ ద్వారా ముందు జాగ్రత్తే కావాలలని పిలుపునిచ్చారు. శుభకార్యాలు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని, కరోనా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండవద్దన్నారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది, రైల్వే, పోలీస్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల తీరు గర్వించదగ్గదని, అంతా శుచి, శుభ్రత మీద దృష్టి పెట్టాలన్నారు.

ఆదివారం జనతా కర్ఫ్యూ‌ని అందరూ పాటించాలన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్షం వద్దని, మనందరం కలిని కరోనాను నిర్మూలిద్దాం అన్నారు ఎంపీ అరవింద్. ఇంట్లోంచి బయటకు రాకుండానే..కరోనాతో యుద్ధం చేస్తున్న వారిని చప్పట్లతో ప్రోత్సహించాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున అక్కడి వారిని వీలయినంత దూరంగా ఉంచాలని, గల్ఫ్ నుండి వచ్చే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. 

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   an hour ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   an hour ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   2 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle