newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాఖీ పండగపై కరోనా ఎఫెక్ట్

03-08-202003-08-2020 11:18:32 IST
2020-08-03T05:48:32.092Z03-08-2020 2020-08-03T05:46:18.666Z - - 12-04-2021

రాఖీ పండగపై కరోనా ఎఫెక్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. పుట్టింటిని వదిలి మెట్టినింటికి చేరినా.. తోడబుట్టిన సోదరుడికి రాఖీ కట్టి.. ఆ రోజంతా కుటుంబంతో కలిసి గడిపి ఆనందించే సోదరీమణులెందరో. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ రోజంతా సరదా సరదాగా ఉంటుంటారు. తెలంగాణలో రాఖీ పండుగకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.అన్నయ్య ఎంత దూరంలో ఉన్నా సరే.. బస్సులు, రైళ్లలో వెళ్లి మరీ రాఖీలు కడుతుంటారు. తన కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన సోదరికి సోదరులు సైతం తోచిన బహుమతులు ఇస్తుంటారు.

కానీ ఈసారి కరోనా మహ్మమారి ప్రభావం రాఖీ పండుగపై పడింది. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు రాఖీ కట్టడానికి వెళ్లలేని పరిస్థితి.బస్సులు ఉన్నా కరోనా భయంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కాస్త దగ్గర్లో ఉంటున్నవారు సైతం.. అనవసరమైన ఇబ్బందులు ఎందుకనే ఉద్దేశంతో రాఖీ కట్టడానికి వెళ్లడం లేదు.ఇక కరోనా సోకిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు వైరస్ సోకిందనే బాధ.. అన్నయ్యకు రాఖీ కట్టలేక పోతున్నామనే ఆవేదనతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు.

ప్రతి ఏడాది రాఖీ పండుగకు అన్నయ్య చేతికి రాఖీ కట్టేదాన్ని.. ఈసారి మాత్రం కట్టలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉంటున్నవారు పక్క వీధిలో ఉంటున్న సోదరులకు రాఖీ కట్టలేకపోతున్నారు.ఒకప్పుడు మోచేతి వరకు రాఖీలతో నిండిపోయిన చేతులు.. ఈ ఏడాది బోసిపోయి కనిపిస్తున్నాయి. రాఖీ కట్టేందుకు చెల్లి రాలేదని బాధపడుతున్న అన్నయ్యలెందరో వున్నారు. 

సరేలే వచ్చే ఏడాదికి పరిస్థితి మారుతుంది కదా. అప్పుడు రాఖీ పండుగను ఘనంగా చేసుకుందామని తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు.

సోదరుడికి రాఖీ కట్టలేకపోతున్నాం అని బాధపడుతున్న వారికి ఆన్‌లైన్  రాఖీలు, కొరియర్ సేవలు కొంత ఊరటనిస్తున్నాయి. రాఖీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి సోదరుడికి పంపిస్తున్నారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle