newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

22-02-202022-02-2020 13:10:41 IST
2020-02-22T07:40:41.730Z22-02-2020 2020-02-22T07:40:36.820Z - - 15-04-2021

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణ వ్యక్తుల కామెంట్లకు పెద్దగా విలువ ఉండక పోవచ్చు. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఏం చేసినా పెద్ద సంచలనమే అవుతుంది. ఒక్కోసారి కొన్ని కామెంట్లు వివాదాం రాజేస్తాయి. జగిత్యాల కలెక్టర్ గుగులోతు రవి ఇప్పుడు అటువంటి వివాదంలోనే చిక్కుకుని ఇబ్బందిపడుతున్నారు. సినీ నటి రష్మిక మందన్న ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోలకు 'చించావ్  పో' అంటూ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన కామెంట్ పెద్ద దుమారమే రేపుతోంది. 

విషయం తెలిసిన ఆయన 'అయ్యో....తనకా విషయమే తెలియదు' అంటూ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ కామెంటే చేయలేదని, తన అకౌంట్ హ్యాక్ అయిందన్నారు. అసలు సంగతి ఏంటంటే.. భీష్మ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముందు రష్మిక ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. వేలాది మంది నచ్చిన కామెంట్లు పెట్టారు. అనూహ్యంగా జగిత్యాల కలెక్టర్ నుంచి కామెంట్ షేర్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బాధ్యతాయుతమైన కలెక్టర్ ఇలా వ్యాఖ్యానించడం ఏంటంటూ మండిపడ్డాడు.

విషయం తెలిసిన కలెక్టర్ రవి కూడా ఆశ్చర్యపోయారు. 'తానసలు కామెంట్ పెట్టలేదని, ఎవరో తన ఖాతా హ్యాక్ చేసినట్టు ఉన్నారు' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు నెట్టిజన్లు కూడా ఆలోచనలో పడ్డారు. కామెంట్ లో రష్మిక బదులు రద్మిక అని స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది.

కలెక్టర్ కామెంట్ అయితే అలా మిస్టేక్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు ఈడీఎం మమత, హ్యాండ్ హెల్డింగ్ పర్సన్ ప్రసాద్ లను విధుల నుంచి తప్పించారు.

స్పెల్లింగ్ మిస్టేక్ నీట్ గా కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఆ ట్వీట్.. కలెక్టర్ చేసి ఉండరు అనే చర్చ జరుగుతోంది. కలెక్టరే అయి ఉండి రష్మిక స్పెల్లింగ్ ఎందుకు తప్పు రాస్తారు అని కొందరు వాదిస్తున్నారు. మొత్తంగా జగిత్యాల కలెక్టర్ రవి పేరు అందరి నోళ్లలో నానుతోంది. సోషల్ మీడియాలో కేటుగాళ్ళు ప్రముఖుల అకౌంట్లను హ్యాక్ చేసి పారేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త!


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle