newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

రవిప్రకాష్ గొంతు విప్పారు

15-05-201915-05-2019 17:39:17 IST
2019-05-15T12:09:17.937Z15-05-2019 2019-05-15T12:09:15.583Z - - 21-08-2019

రవిప్రకాష్ గొంతు విప్పారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును.. రవిప్రకాష్ గొంతు విప్పారు. తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఓ వెబ్‌సైట్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను కావాలనే టార్గెట్ చేసిందని రవిప్రకాశ్ ఆరోపించారు. ఇంటర్ ఫలితాలు వెల్లడైన తర్వాత జరిగిన పరిణామాలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో టీవీ9లో ఒక కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ రోజు స్వయంగా తానే తెరపై కనిపించి బోర్డు వైఫల్యాలను ప్రశ్నించానని.. ఆనాటి నుంచే తెలంగాణ ప్రభుత్వం తనని టార్గెట్ చేసిందని రవిప్రకాష్ ఆరోపించారు.

ఈటార్గె్ట్ వెనుక రాజకీయ కారణాలే కాక వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. తాను ఆ రోజు ఇంటర్ బోర్డు వైఫల్యాల మీద మాట్లాడానే తప్ప ప్రభుత్వాన్ని అసలు ప్రశ్నించలేదని కాని దాన్ని ఆసరాగా తీసుకొని తనను టార్గెట్ చేశారని ఆయన వాపోయారు. అలాగే రేవంత్ రెడ్డి ఐటీరైడ్స్ గుట్టు విప్పారు రవిప్రకాష్.  రవిప్రకాశ్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా తెలంగాణ పోలీసులు ఆయన కోసం వేటాడుతున్నారు. కాని ఆయన ఆచూకీ లభించడంలేదు. ఇదే సమయంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనం రేపుతోంది. 

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగిన రోజున తాను అమెరికాలో ఉన్నానని.. కాని టీవీ9 న్యూస్ రూం నుంచి తనకు కాల్ వచ్చిందని చెప్పారు. జూపల్లి రామేశ్వరరావు కొడుకు, సోదరుడు రేవంత్ రెడ్డిపై వ్యతిరేక వార్తలు ప్రసారం చేయమని టీవీ9 స్టాఫ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. కాని దానికి తాను ఒప్పుకోలేదని.. ఎందుకంటే ఇదంతా రాజకీయ శత్రుత్వం వల్లే జరిగిందని రవిప్రకాశ్ చెప్పారు. రవిప్రకాశ్, మైహోం రామేశ్వరరావుకు మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయనే విషయం తెలుస్తోంది. అలంద మీడియాలో రామేశ్వరరావు ఒక డైరెక్టర్ అన్నసంగతి తెలిసిందే. టీవీ9 వ్యవహారంలో రవిప్రకాష్ ఇంకెన్ని సంచలనాలు బయటపెడతారో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle