newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

రండి బాబూ రండి.. పోటీకి ఛాన్స్ ఇస్తాం..!

12-11-201912-11-2019 08:03:35 IST
2019-11-12T02:33:35.170Z12-11-2019 2019-11-12T02:32:14.878Z - - 13-12-2019

రండి బాబూ రండి.. పోటీకి ఛాన్స్ ఇస్తాం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రీంన‌గ‌ర్ రాజ‌కీయాలు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటాయి. వ‌రుస విజ‌యాల‌తో దూకుడుమీదున్న టీఆర్ఎస్ పార్టీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మెజార్టీ పీఠాల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్లాన్‌ల‌ను మొద‌లుపెట్టింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలో మాత్రం ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కాంగ్రెస్ నుంచి ప‌లువురు పెద్ద నాయ‌కులతోపాటు ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా పార్టీ వీడిపోయారు. సీనియ‌ర్ల పెత్త‌నాన్ని త‌ట్టుకోలేక కేడ‌ర్ కూడా వేరే దారులు వెతుక్కుంటూ పోయాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుకోవడం ఆ పార్టీకి క‌త్తిమీద సామే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.  

మ‌రోప‌క్క‌, మున్సిప‌ల్ ఎన్నికల్లో త‌మ స‌త్తా చూపిస్తామంటూ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌క‌టించడాన్నిచూసి ఆ పార్టీలో ఉన్న‌వారే కొంద‌రు న‌వ్వుకోవ‌డం విశేషం. కొత్త వారికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని, యువ‌కులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ దండోరా వేసి పిలుస్తున్నారు.

ఎందుకంటే..? ఇప్ప‌టికే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌గిన అభ్య‌ర్ధులు పార్టీలో లేర‌ని చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే కొత్త‌వారికి ఛాన్స్ అంటూ గొప్ప‌లు చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి పోటీ చేసేందుకు పార్టీలో ఉన్న‌వారే సుముఖంగా లేర‌ని, అలాంటిది కొత్త‌వారు పార్టీలోచేరి పోటీకి సిద్ధ‌ప‌డే అవ‌కాశం ఎక్క‌డుంద‌న్న ప్ర‌శ్న‌లు ఎదురవుతున్నాయి.

ఇక ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న బీజేపీ కూడా తాము మెజార్టీ స్థానాల‌ను గెలిచేస్తామ‌ని చెబుతోంది. పార్టీని బ‌ల‌ప‌రుచుకునేందుకు కేడ‌ర్‌ను స‌మ‌కూర్చుకుంటున్న ఆ పార్టీ టికెట్‌లు ఆశించేవారు మాత్రం పార్టీలోకి రావొద్ద‌ని చెబుతోంది. దీంతో అస‌లు టికెట్లు ఇవ్వ‌న‌ప్పుడు ఎందుకు ఆ పార్టీలోకి వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.

ఇలాంటి కండీష‌న్స్ అప్లై డ్రామాలు మ‌న‌కెందుకులే అని సైడైపోతున్నార‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్ మాత్రం గెలిచే అవ‌కాశాలు ఉన్న అభ్య‌ర్ధుల‌ను సిద్ధం చేసుకుంటోంది.

అధికారంలో ఉన్న పార్టీ కాబ‌ట్టి ఈ వ్య‌వ‌హారాన్ని సులువుగానే పూర్తి చేసుకుంటూ ఉంది. కాక‌పోతే ఎవ‌రికి టికెట్ ఇస్తే ఎలాంటి అసంతృప్తులు ఎదుర‌వుతాయోన‌ని భ‌యం మాత్రం ఆ పార్టీలో ఉంది.

ఎటొచ్చి కాంగ్రెస్‌లో మాత్రం టికెట్ కౌంట‌ర్లు ఓపెన్‌చేసి రండి.. బాబూ.. రండీ పోటీకి ఛాన్స్ ఇస్తామ‌ని పిలుస్తున్నా ఎవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎవ‌రైనా వ‌స్తారేమో చూద్దామ‌న్న ఆలోచ‌న‌లో పార్టీ వ‌ర్గాలు ఉండ‌టం విశేషం.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle