newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రంజాన్ వేళ అత్తరు వాసనల్లేవ్.. గాజుల గలలు లేవు !

24-04-202024-04-2020 11:33:19 IST
Updated On 24-04-2020 11:46:41 ISTUpdated On 24-04-20202020-04-24T06:03:19.164Z24-04-2020 2020-04-24T06:02:55.684Z - 2020-04-24T06:16:41.307Z - 24-04-2020

రంజాన్ వేళ అత్తరు వాసనల్లేవ్.. గాజుల గలలు లేవు !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ అంటే ఛార్మినార్.. రంజాన్ వచ్చిందంటే చాలు ఈ పరిసరాలు సందడిగా మారతాయి. భాగ్యనగరంలో రంజాన్‌ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ముస్లింలు ప్రతి ఏటా ఈ పండుగను నెల రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. దీనికి తగ్గట్లుగానే రంజాన్‌ మార్కెట్‌ భారీగా ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుంది అయితే ఈ ఏడాది కోవిడ్‌ మహమ్మారి కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్‌ మార్కెట్‌ కళ తప్పింది. ఇఫ్తార్‌ విందులు, వస్త్రాలు, హోటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్‌బజార్‌ గాజుల గలగలలు ఎక్కడా కనిపించడం లేదు.

రంజాన్ ప్రారంభం అయినా మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. రంజాన్‌ మాసంలో అన్ని వ్యాపార సముదాయాలు కళకళలాడుతుంటాయి. పాతబస్తీలోని పటేల్‌ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్‌గంజ్, ఘాన్సీబజార్, చార్‌కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్‌గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి. రంజాన్‌ మార్కెట్‌లో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ,శంషీర్‌గంజ్‌ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి.   

రంజాన్ వేళ అంతర్జాతీయ జానిమాజ్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతారు. ఈసారి  ఈ మార్కెట్ పై కరోనా ప్రభావం పడింది. లక్షలాది రూపాలయల వ్యాపారం దెబ్బతింటోంది. దీంతో పాటు కుర్తా, ఫైజామా, టోపీలను కూడా మార్కెట్‌లలో అందుబాటులో ఉండేవి. ఇవేవీ ఈసారి రంజాన్‌ మాసంలో కనిపించవు. రంజాన్‌ మాసానికి రెండు నెలలకు ముందు నుంచే  సేమియాల తయారీ కొనసాగుతుంది.

గత నెల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో సేమియా తయారీకి అవసరమైన ముడిసరుకు లభించడం లేదని. ఈసారి సేమియా మార్కెట్లో అంతగా కనిపించకపోవచ్చంటున్నారు. అలాగే ఖర్జూరం కూడా ఇతర దేశాలనుంచి దిగుమతి అవుతుంది. కరోనాతో ఖర్జూరం తీపి కూడా రంజాన్ వేళ కనిపించడం లేదంటున్నారు. కరోనా ప్రభావంతో పాటు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున రంజాన్‌ మాసంలో ఎవరూ మక్కా మసీదుకు రావద్దు. సహర్, ఇఫ్తార్, తరావీలతో పాటు జుమ్మాకీ నమాజ్‌లను  ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి. ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసారు. 

రంజాన్ అంటే అత్తరు గుబాళింపే. అయితే ఈసారి అత్తరు అమ్మకాలు తక్కువగా ఉండబోతున్నాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్తర్‌తోనే సర్దుకోనున్నారు. గులాబి రేకులు, మల్లెపువ్వులు, మొగలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్‌ కావాలో దానిని ప్రత్యేకంగా తయారుచేసిన బట్టీలలోని తయారుచేస్తారు. తెలంగాణతో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయి.  అలాగే సుర్మా కూడా ప్రత్యేకం. ప్రవక్త మూసా అలైహి సలాం సుర్మాను వాడారు కాబట్టి ముస్లిం సోదరులు దీనిని సున్నత్‌గా భావించి రంజాన్‌ మాసంలో వాడుతున్నారు.  జీవిత కాలంలో కనీసం ఒక తులం సుర్మాను తప్పని సరిగా వాడాల్సి ఉంటుందంటారు. 

చీరలు, వస్త్రాలకు  పాతబస్తీలోని పటేల్‌ మార్కెట్‌ కేంద్రబిందువు.  అయితే ఈ రంజాన్‌ మాసంలో వస్త్ర దుకాణాలు తెరుచుకునే పరిస్థితులు లేవు. దాదాపు 2 వేల వరకు ఇక్కడ దుకాణాలున్నాయి. దాదాపు 50 టెక్స్‌టైల్స్‌ ఫ్యాక్టరీల అనుబంధ వ్యాపారాలు వుంటాయి. లాక్ డౌన్ కారణంగా కొత్త బట్టలు కుట్టించుకునేవారే కనిపించడంలేదు. దీంతో  టైలర్లు ఉపాధి కోల్పోయారు. రంజాన్ సందర్భంగా రంగురంగుల గాజులు లాడ్ బజార్లో అమ్ముతారు. ముస్లింలే కాదు ఇతర మతస్తులైన మహిళలు కూడా ఇక్కడి గాజులు కొనుగోలుచేస్తారు. ఈసారి మాత్రం గాజుల గలగలలు వినిపించడం లేదని వ్యాపారులే అంటున్నారు. 

 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   4 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   5 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   6 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   19 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   21 hours ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle