newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

రంజాన్‌లో లాక్ డౌన్ ఆదేశాలు పాటించాల్సిందే!

17-04-202017-04-2020 11:22:48 IST
Updated On 17-04-2020 11:33:19 ISTUpdated On 17-04-20202020-04-17T05:52:48.910Z17-04-2020 2020-04-17T05:52:36.702Z - 2020-04-17T06:03:19.238Z - 17-04-2020

రంజాన్‌లో లాక్ డౌన్ ఆదేశాలు పాటించాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 13 వేలు దాటినా కరోనా కేసులు,నాలుగు వందలకు పైగా మరణాలు పరిస్థితి తీవ్రతను తెలియచేస్తున్నాయి. మహారాష్ట్ర,ఢిల్లీ,తమిళనాడు,మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీలో విజృంభిస్తోంది ఈ వైరస్. మహారాష్ట్రలో 3202 కేసులు,194 మంది మృతి చెందారు. ఢిల్లీలో 1640 కేసులు,38 మంది, తమిళనాడులో 1267 కేసులు,15 మంది మృతి చెందారు.

ఇటు మధ్యప్రదేశ్ లో 1164 కేసులు నమోదుకాగా, 55 మంది మృతి చెందారు. రాజస్థాన్ లో 1131 కేసులు,11 మంది మృతి చెందారు. గుజరాత్ లో 929 కేసులు,36 మంది, ఉత్తరప్రదేశ్ లో 805 కేసులు,13 మంది మరణించారు. తెలంగాణాలో 700 కేసులు,18 మంది మృతి చెందగా, ఆంధ్రప్రదేశ్ లో534 కేసులు,14 మంది మృతి చెందారు. కేరళలో 394 కేసులు,ఇద్దరు మృతి చెందారు. కేరళలో కరోనా నివారణ చర్యలు పకడ్బందీగా సాగుతున్నాయి. కర్ణాటకలో 315 కేసులు నమోదు కాగా 13 మంది మృతిచెందారు. జమ్మూకాశ్మీర్ లో 314 కేసులు నమోదయ్యాయి. అక్కడ ,నలుగురు మృత్యువాత పడ్డారు. 

రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి కోరారు. ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఈ రోజొక  ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో స్టేట్ వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ చైర్మన్‌ కూడా అయిన నఖ్వి  ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, ఇమాంబాద్, దర్గాలు, ఇతర మత సంస్థలు స్టేట్ వక్ఫ్ బోర్డుల కిందకు వస్తాయిని తెలిపారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్‌డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఇప్పటికే కోరాననీ, వారితో స్వయంగా  మాట్లాడానని నఖ్వి పేర్కొన్నారు. ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలు జరుపుకునేలా చూస్తామని  వారు తనకు  హామీ ఇచ్చినట్లు తెలిపారు. 

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పవిత్ర పుణ్య మాసమైన రంజాన్‌ తారావీహ్‌ నమాజ్‌లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని ఉలేమాలు, ముఫ్తీలు, ఇస్లామిక్‌ స్కాలర్‌లు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జామియా–నిజామియా  ఒక ప్రకటన విడుదల చేసింది. రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా సహర్‌తో పాటు ఇఫ్తార్‌లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. డబ్బులు వృథా చేయకుండా పేదలకు చేయూత అందించాలని, లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని జామియా–నిజామియా కోరింది.  

రంజాన్‌ నెలలో తారావీహ్‌ను ఇంట్లోనే చేసుకోవాలని ఉలేమాన్, ముఫ్తిలు కోరడాన్ని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినందున ఇదో మంచి విజ్ఞప్తి అన్నారు. అన్ని ముస్లిమ్‌ పాఠశాలలకూ మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కచ్చితంగా పాటించాలన్నారు. ఇంట్లోనే వుండి ప్రార్థనలు చేసుకోవడం ఎంతో అవసరం అన్నారు. 

 

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

   35 minutes ago


తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   14 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   15 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   19 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   20 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   21 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   a day ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   a day ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   a day ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle