newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన.. యువతిపై రేప్, మర్డర్

17-03-202017-03-2020 14:47:18 IST
2020-03-17T09:17:18.131Z17-03-2020 2020-03-17T09:17:15.648Z - - 14-04-2021

రంగారెడ్డి జిల్లాలో మరో దిశ  ఘటన.. యువతిపై రేప్, మర్డర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్ని చట్టాలు వచ్చినా నేరాలు, ఘోరాలు ఆగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన కలకలం రేపుతోంది. మృగాళ్ళ మారణకాండకు మరో అబల బలయింది.  రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ యువతి దారుణ హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. యువతి మొహంపై కొందరు దుండగులు బండరాయితో మోదీ దారుణంగా హతమార్చారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహం బయటపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ సంఘటన దిశ ఘటనను పోలివుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై అత్యాచారం జరిగి ఉండవచ్చునని, అనంతరం ఆమెను హత్యచేసి నిందితులు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మిస్సింగ్‌ కేసు ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్‌ స్టేషన్లకు ఈ హత్యకు సంబంధించి సమాచారం అందించారు. ఘటనాస్థలంలో క్లూస్‌ టీ ఆధారాలు సేకరిస్తోంది. 

మరోవైపు ఈ కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రంగంలోకి ఐదు బృందాలను నియమించామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, తల పగిలి వుండడంతో ఆమెపై అఘాయిత్యం జరిగిందని అనుమానిస్తున్నామన్నారు డీసీపీ ప్రకాష్ రెడ్డి. అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని, మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందని  ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చేతికి రింగ్, చెవులకు కమ్మలు అలాగే ఉండడంతో డబ్బుల కోసం కాకుండా ఆమెపై అత్యాచారం చేసి చంపినట్టు భావిస్తున్నారు. 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   23 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle