newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రంగనాయక సాగర్ ఎత్తిపోతల ప్రారంభం.. మరో తెలంగాణ కల సాకారం

24-04-202024-04-2020 13:25:08 IST
Updated On 24-04-2020 13:30:40 ISTUpdated On 24-04-20202020-04-24T07:55:08.498Z24-04-2020 2020-04-24T07:55:05.515Z - 2020-04-24T08:00:40.108Z - 24-04-2020

రంగనాయక సాగర్ ఎత్తిపోతల ప్రారంభం.. మరో తెలంగాణ కల సాకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాళేశ్వరం ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రారంభించారు. ఈ నీటి రిజర్వాయర్ ద్వారా దాదాపు 70 వేల ఎకరాల భూమికి సాగునీరు అందివ్వడమే కాకుండా తాగునీటిని కూడా సరఫరా చేయనున్నారు. అలాగే చెరువుల్లో నీటిని నింపేందుకు కూడా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో నీటి సమస్యను ఈ రిజర్వాయర్ ఇకనుంచి శాశ్వతంగా పరిష్కరించనుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రిజర్వాయర్ కింద తమ భూములను పోగొట్టుకున్న వారికి తమ ప్రభుత్వం ఇప్పటికే సహాయ, పునరావాస ప్యాకేజీని పూర్తిగా అందించిందని తెలిపారు. 

కాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రంగనాయక సాగర్  నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్  శాఖ చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోయడానికి లిఫ్టులను నాలుగైదురోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభారకరావుకు నిర్దేశించారు. విద్యుత్ శాఖ తనకు అప్పగించిన పనులన్నింటినీ నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేస్తూ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో 134.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మోటార్ 24 గంటల్లో 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పనిచేస్తాయి. మూడు టీఎంసీల కెపాసిటి కలిగిన రిజర్వాయర్‌లో నాలుగు మోటార్లు మూడు రోజులు నడిపితే రిజర్వాయర్ నిండుతుంది. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తారు. 

మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో బైపాస్ కాలువ ద్వారా నేరుగా గజ్వేల్ నియోజకవర్గం, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీరంగనాయక సాగర్‌లో దశలవారీగా మొదట ఒక టీఎంసీ నీటిని నింపి ప్రాజెక్టు కట్ట సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అన్ని సవ్యంగా ఉంటే మరో టీఎంసీ, ఆ తర్వాత ఏ సమస్య రాకపోతే పూర్తి రిజర్వాయర్ నింపుతారు. ఈ రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలో దాదాపు 70కిపైగా చెరువుల్లోకి నీటిని నింపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో నీరు నింపడం ద్వారా సిద్దిపేట జిల్లాలో 70వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.

సాగునీరు, తాగనీటి కోసం ఆరుదశాబ్దాల దాహంతో ఉన్న తెలంగాణ ఒక్కటొక్కటిగా ప్రాజెక్టులు పరిపూర్తి  అవుతూ బీడు భూములను పచ్చని పంటపొలాలుగా మారుస్తున్న వేళ.. తెలంగాణ మాగాణి ఇక నాదే ఆలస్యం అన్నట్లుగా పంట సిరులను కురిపిస్తోంది. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle