newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

రంగంలోకి కేంద్రం - కేసీఆర్‌ సర్కార్‌కు ఇబ్బంది తప్పదా?

02-11-201902-11-2019 13:02:46 IST
Updated On 02-11-2019 17:27:01 ISTUpdated On 02-11-20192019-11-02T07:32:46.297Z02-11-2019 2019-11-02T07:32:43.576Z - 2019-11-02T11:57:01.522Z - 02-11-2019

రంగంలోకి కేంద్రం - కేసీఆర్‌ సర్కార్‌కు ఇబ్బంది తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పలు డిమాండ్‌లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నెలరోజులకు చేరువైంది. అటు ప్రభుత్వం పట్టువీడకపోవటంతో కార్మికులుసైతం అంతే తీవ్రతతో సమ్మెను ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఓవైపు సమ్మెను ఉధృతం చేస్తూనే కార్మికులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టుసైతం ప్రభుత్వం తీరును తప్పుబడుతూ వస్తోంది.

శుక్రవారం ఆర్టీసీకి సంబంధించిన లెక్కల సమర్పించిన విషయంలోనూ తప్పుల తడకగా నివేదికలు ఇచ్చారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కార్మికులను చివాట్లు పెడుతోంది. అయినా అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల సీఎం కేసీఆర్‌ కఠినంగా ఉండటంతో పాటు, వారు అసలు ఆర్టీసీ ఉద్యోగులే కాదని, వారికి వారే సెల్ప్‌ డిస్మిస్‌ చేసుకున్నారని ప్రకటించారు. దీనికితోడు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. దీంతో మనస్థాపంతో పలువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బాబు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కరీంనగర్‌లోని బాబు నివాసం వద్దకు అఖిలపక్షం నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు వెళ్లి నివాళులర్పించారు.

బాబు అంతిమయాత్రలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణవాతావరణం నెలకొంది. పోలీసులు ఎంపీ సంజయ్‌ పట్ల, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడంలో కరీంనగర్‌ కమీషనరేట్‌ కార్యాలయం ఎదుట సంజయ్‌ ఆందోళనకు దిగారు.

Image result for bjp mp bandi sanjay issue about polices

కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. అలాగే ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల ఒవరాక్షన్‌పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. తాజా పరిణామాలతో లక్ష్మణ్‌ వెంటనే ఢిల్లీ రావాలని పార్టీ అధిష్టానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మణ్‌ హోమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వివరించనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రవర్తన పట్ల ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న బీజేపీ.. తాజా పరిస్థితులపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31శాతం వాటా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఇప్పటికే తమ్మినేని వీరభద్రంతో పాటు ఇతర నేతలు వ్యాఖ్యానించారు. కేంద్రం నేరుగా రంగంలోకి దిగి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరింపజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ కేంద్ర పెద్దలు.. అదునుచూసి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో బలోపేతం అయ్యేలా బీజేపీ పెద్దలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆర్టీసీ సమ్మెపై శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్‌ తీసుకొనే నిర్ణయాల మేరకు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై బీజేపీ పెద్దలు సమమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం దృష్టికేంద్రీకరిస్తుండటంతో ఇక కేసీఆర్‌ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle