newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

యూనియన్లంటే కేసీయార్‌కు అంత చికాకు ఎందుకో..?

29-10-201929-10-2019 07:59:56 IST
Updated On 29-10-2019 17:15:49 ISTUpdated On 29-10-20192019-10-29T02:29:56.833Z29-10-2019 2019-10-29T02:27:14.027Z - 2019-10-29T11:45:49.375Z - 29-10-2019

యూనియన్లంటే కేసీయార్‌కు అంత చికాకు ఎందుకో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు యూనియ‌న్లు అనే పేరు వినిపిస్తేనే ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేప‌థ్యంలో ఆయ‌న ఆర్టీసీ యూనియ‌న్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న యూనియ‌న్ల‌పై ఎంత కోపంగా ఉన్నార‌నేది స్ప‌ష్టం చేస్తున్నాయి.

అస‌లు ఆర్టీసీలో యూనియ‌న్ల‌గిరి ఉండొద్ద‌ని సైతం ఆయ‌న వ్యాఖ్యానించారు. యూనియ‌న్ల రాజ‌కీయం వ‌ల్లే ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.   

కేవ‌లం ఆర్టీసీనే కాకుండా ఇత‌ర ఉద్యోగ సంఘాల ప‌ట్ల కూడా కేసీఆర్ వ్య‌తిరేక భావ‌న‌తో ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఉపాధ్యాయుల‌కు ఇన్ని సంఘాలు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. దీనిపైన ఉపాధ్యాయులు సైతం మండిప‌డ్డారు.

అయితే, ఇప్పుడు ఇంత‌లా సంఘాల‌ను వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సంఘాల‌ను ప్రోత్స‌హించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు ఆయ‌న చొర‌వ తీసుకున్నారు.

తెలంగాణ ఏర్ప‌డి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక కూడా కొంత‌కాలం పాటు ఉద్యోగ సంఘాల‌తో కేసీఆర్ మంచి సంబంధాలే నెరిపారు. త‌ర్వాత ఈ సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం సంఘాలు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి.

కానీ, ఉద్యోగుల‌కు గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌నంత మేలు తాను చేశాన‌ని, అయినా సంతృప్తి ప‌డ‌కుండా త‌న‌ను ఎదురిస్తున్నార‌నే భావ‌న‌తోనే కేసీఆర్ సంఘాల ప‌ట్ల ప్ర‌తికూలంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలంగాణ ఉద్య‌మంలో సింగ‌రేణి, ఆర్టీసీ కార్మికులు కీల‌క పాత్ర పోషించారు. స‌క‌ల జ‌నుల స‌మ్మెలో వీరు పాల్గొన‌డం ద్వారానే విజ‌య‌వంత‌మైంది. సింగ‌రేణి, ఆర్టీసీ కార్మికులు ఉద్య‌మంలో ఏక‌తాటిపైకి రావ‌డానికి ఆ స‌మ‌యంలో కేసీఆర్ వ్యూహాలే కార‌ణం. ఆర్టీసీలో అప్ప‌టివ‌ర‌కు ఎన్ఎంయూ, ఈయూ ఆధిప‌త్యం ఉండేది. మొద‌టిసారి టీఆర్ఎస్‌కు అనుబంధంగా తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్‌(టీఎంయూ)ను ఏర్పాటు చేయించారు.

ఈ సంఘానికి గౌర‌వ అధ్య‌క్షుడిగా హ‌రీష్‌రావు ఉంటూ సంఘాన్ని బ‌ల‌ప‌రిచారు. దీంతో ఎన్ఎంయూ, ఈయూ బ‌ల‌హీన‌ప‌డి టీఎంయూ బ‌ల‌మైన సంఘంగా ఎదిగింది. మొన్న‌టివ‌ర‌కు ఈ సంఘం టీఆర్ఎస్‌కు అనుబంధంగానే కొన‌సాగింది. త‌ర్వాత హ‌రీష్ రావు సంఘానికి దూరం కావ‌డం, ఆర్టీసీ స‌మ్మెకు టీఎంయూనే నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో టీఆర్ఎస్‌తో దూరం పెరిగింది.

దీంతో ఆ సంఘం జెండా రంగును సైతం గులాబీ నుంచి తెలుపుగా మార్చుకొని పూర్తిగా టీఆర్ఎస్‌తో సంబంధాలు తెంచుకుంది. ఇక‌, సింగ‌రేణిలోనూ టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం(టీజీబీకేఎస్‌)కు క‌ల్వకుంట్ల క‌విత గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉండేవారు. ఎన్నిక‌ల ముందు ఆమె రాజీనామా చేశారు. త‌ర్వాత టీజీబీకేఎస్‌లో రెండు వ‌ర్గాలు ఏర్ప‌డి ఒక వ‌ర్గం బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.

ఉద్య‌మ సమ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తానికి ఒకే సంఘాలు ఉన్న‌ప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యోగుల‌ను ప్ర‌త్యేక సంఘాల ఏర్పాటుకు ప్రోత్స‌హించారు. ఈ మేర‌కు ప‌లు ఉపాద్యాయ‌, రెవెన్యూ సంఘాలు తెలంగాణ‌కు ప్ర‌త్యేకంగా ఏర్ప‌డ్డాయి.

కానీ, ఇప్పుడు ఈ సంఘాల‌ను  కేసీఆర్ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఉపాద్యాయుల‌కు ఇన్ని సంఘాలు అవ‌స‌ర‌మా అని ఆయ‌న వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల రెవెన్యూ సంఘాల ప‌ట్ల కూడా ప్ర‌భుత్వం కొంత సీరియ‌స్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో కేసీఆర్‌కు విధేయుడిగా, ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కంలో తెలంగాణ ఉద్య‌మంలో ప‌ని చేసిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత‌ వి.ల‌చ్చిరెడ్డి రెవెన్యూ సంఘాల‌ను ఏకం చేస్తున్నార‌నే కార‌ణంతో మేడ్చ‌ల్ జిల్లా నుంచి భూపాల‌ప‌ల్లి జిల్లాకు బదిలీ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక‌, విద్యుత్ ఉద్యోగ సంఘాల‌కు నాయ‌కుడిగా ఉంటూ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్న జేఏసీ నేత ర‌ఘును కూడా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.ఆయన కూడా తెలంగాణ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్నారు.

విద్యుత్ విష‌యంలో అప్ప‌టి సీమాంధ్ర నేత‌ల వాద‌న‌కు ర‌ఘు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చేవారు. కానీ, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను బ‌దిలీ చేశార‌నే ప్ర‌చారం ఉంది. ఇలా గ‌తంలో త‌న‌తో ఉద్య‌మంలో క‌లిసి ప‌నిచేసిన సంఘాల నేత‌ల ప‌ట్ల‌, సంఘాల ప‌ట్ల కేసీఆర్ వ్య‌తిరేకంగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle