newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

యువతి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అందుకే వెళ్లిపోయిందా?

20-12-201920-12-2019 08:31:39 IST
2019-12-20T03:01:39.660Z20-12-2019 2019-12-20T02:59:30.938Z - - 22-02-2020

యువతి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అందుకే వెళ్లిపోయిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌లో మరో యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. సూపర్ మార్కెట్‌కు డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు ఓ అమ్మాయి. దుండిగల్‌లో యువతి అదృశ్యంపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యువతులు, విద్యార్ధినులు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో ఓవైపు అంతా ఆందోళన చెందుతున్న సమయంలో... దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయత్రి అనే 19 ఏళ్ల అమ్మాయి అదృశ్యమైంది. అయితే ఆమె మిస్సింగ్ వెనుక మిస్టరీ ఉందని తెలుస్తోంది.

దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్‌లో నివాసం ఉండే గాయత్రి కనిపించకుండా పోయింది. గురువారం  మధ్యాహ్నం ఆమె ఉద్యోగం చేస్తున్న సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. రాత్రి ఆలస్యమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా వాకబు చేసినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంసభ్యులు  దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూపర్ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అమ్మాయి ఎప్పుడు ఎలా అదృశ్యం అయిందో  ఆరా తీస్తున్నారు.  

అయితే, ఈ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది.  ఈ మేరకు తన కోసం వెతకొద్దంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు.

అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదుతో ఇంట్లో తనిఖీ చేశారు. ఆమె రూంలో రాసిన లేఖ లభించింది. సీసీ కెమెరాలు, సెల్‌ ఫోన్‌ కాల్‌ డాటా ఆధారంగా గాయత్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   7 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   9 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle