యాదాద్రి పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. ఊహించని ఘటన..!
14-09-202014-09-2020 07:02:34 IST
Updated On 14-09-2020 07:15:27 ISTUpdated On 14-09-20202020-09-14T01:32:34.978Z14-09-2020 2020-09-14T01:32:28.831Z - 2020-09-14T01:45:27.900Z - 14-09-2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పర్యటనకు వెళ్లారు. ఆలయ పరిసరాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యటన సాగింది. మొదట ఆలయం వద్దకు చేరుకోగానే పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు.
ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి యాదాద్రికి రావడం ఇది 13వ సారి. అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
రోడ్డుమార్గం ద్వారా కొండపైకి చేరుకున్న తిరుగుప్రయాణంలో గుట్టపై ఉన్న కోతులను చూసి వాహనం ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది తెచ్చిన అరటికాయలను ఆ కోతులకు అందించారు. కోతులు పెద్ద సంఖ్యలో ఉన్నా విసుక్కోకుండా ఎంతో ఓపిగ్గా వాటికి ఆహారం అందించారు. తన కాన్వాయ్‌ను పక్కకు ఆపి కోతులకు అరటి పండ్లు పంచారు. గుంపులు గుంపులుగా వచ్చిన కోతులు ఒక్కో పండును అందుకుని వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
12 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
16 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
19 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
14 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా