newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మ‌హా ఎపిసోడ్.. తెలుగు సీఎంల‌కు మంచే చేసిందా..!?

28-11-201928-11-2019 08:34:52 IST
Updated On 28-11-2019 11:27:25 ISTUpdated On 28-11-20192019-11-28T03:04:52.584Z28-11-2019 2019-11-28T02:57:47.964Z - 2019-11-28T05:57:25.670Z - 28-11-2019

మ‌హా ఎపిసోడ్.. తెలుగు సీఎంల‌కు మంచే చేసిందా..!?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆడిన రాజ‌కీయ క్రీడ దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లో క‌ల‌కలం రేపింది. సూర్యుడు ఉద‌యించ‌కముందే మ‌హారాష్ట్ర‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎత్తివేయించ‌డం, ఎన్సీపీ అధ్య‌క్షుడికే తెలియ‌కుండా ఆ పార్టీ మ‌ద్ద‌తు పొంద‌డం, దేశ‌ప్ర‌జ‌లు నిద్ర లేవ‌క‌ముందే ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం వంటి ప‌రిణామాలు ఇత‌ర‌ పార్టీల‌కు ఆందోళ‌న క‌లిగించాయి.

బీజేపీ నేత‌లు ఈ రాజ‌కీయ క్రీడ‌ను స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌గా కూడా చెప్పుకున్నారు. బీజేపీ తెర‌లేపిన ఈ రాజ‌కీయ వ్యూహంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీ క‌న్నేసిన రాష్ట్రాల్లోని పార్టీల‌కు ఒక ఆందోళ‌న మొద‌లైంది.

అయితే, మ‌హారాష్ట్ర‌లో బీజేపీ వ్యూహం పూర్తిగా విక‌టించ‌డంతో ఆయా పార్టీలు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌హారాష్ట్ర పొలిటిక‌ల్ డ్రామా కొంత ఊర‌ట ఇచ్చింద‌నే చెప్పాలి.

కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వ‌చ్చాక ఆ పార్టీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చేయాల‌నుకున్న చ‌ట్టాల‌ను మ‌రో ఆలోచ‌న లేకుండా చేసేస్తోంది. త‌మ పార్టీ ల‌క్ష్యాల‌ను ఒక్కోటి పూర్తి చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే దేశం మొత్తం బీజేపీ జెండా ఎగ‌రాల‌నేది ఆ పార్టీ ల‌క్ష్యం. ముఖ్యంగా ద‌క్షిణాధిన క‌ర్నాట‌క దాటి విస్త‌రించాల‌ని బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందుకు గానూ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో నాలుగు ఎంపీలు గెలుచుకోవ‌డం, ప‌లువురు ఇత‌ర పార్టీల నేత‌లు పెద్ద ఎత్తున త‌మ పార్టీలో చేర‌డంతో బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌నేది బీజేపీ వ్యూహం.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రోజే బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లోనూ పొలిటిక‌ల్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఉంటాయ‌ని చెప్పారు.

వివిధ సంద‌ర్భాల్లో తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కేంద్రం జోక్యం చేసుకోబోతోంది అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, టీఆర్ఎస్ పెద్ద‌ల‌పైనా కేసులు న‌మోద‌వుతాయ‌ని, టీఆర్ఎస్‌లో చీలిక వ‌స్తుంద‌నే ఊహాగానాలు కూడా వ‌చ్చాయి. కానీ, ఇప్ప‌టివ‌ర‌కైతే తెలంగాణ‌లో అవేమీ జ‌ర‌గ‌లేదు.

ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పైనా బీజేపీ చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో కేవ‌లం 2 శాతం ఓట్ల లోపే ప‌రిమిత‌మైన ఆ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం అవ్వాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేసి జైలుకు పంపించే అవ‌కాశం ఉంద‌ని, త‌ద్వారా టీడీపీతో పాటు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేత‌ల‌ను బీజేపీలో చేర్చుకుంటుంద‌నే ఊహాగానాలు వ‌చ్చాయి.

అయితే, మ‌హారాష్ట్ర‌లో 80 గంట‌ల్లోనే బ‌ల‌నిరూప‌ణ‌కు ముందు రోజే బీజేపీ అధికారాన్ని వ‌దులుకోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కైతే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎటువంటి క‌ఠిన వైఖ‌రిని అవ‌లంభించే అవ‌కాశం లేదు. ముఖ్యంగా కేసీఆర్‌పైన కేసులు పెట్టినా, జ‌గ‌న్‌ను మ‌ళ్లీ జైలుకు పంపినా, టీఆర్ఎస్‌, వైసీపీ నుంచి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించినా బీజేపీ అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది.

అన్నింటికీ మించి బీజేపీ వేగంగా వివిధ రాష్ట్రాల్లో అధికారం కోల్పోతోంది. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్, కేసీఆర్ లాంటి వారితో స‌ఖ్య‌త ఉండ‌టం వ‌చ్చే ఎన్నిక‌ల కోస‌మైనా ఆ పార్టీకి అవ‌స‌రం. కాబ‌ట్టి, ఇప్ప‌టి వ‌ర‌కైతే జ‌గ‌న్‌, కేసీఆర్ ప‌ట్ల బీజేపీ క‌ఠినంగా వెళ్ల‌క‌పోవ‌చ్చు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle