newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

22-02-202022-02-2020 15:07:20 IST
2020-02-22T09:37:20.943Z22-02-2020 2020-02-22T09:37:19.102Z - - 15-04-2021

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొత్త అధ్య‌క్షుడు రానున్నారు. ఇప్ప‌టికే అధిష్ఠానం కొత్త సార‌థి ఎంపిక‌కు క‌సర‌త్తు చేస్తోంది. అధిష్ఠానం నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధులు రాష్ట్రంలో బీజేపీ సంస్థాగ‌త ఎన్నిక‌ల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల‌కు అధ్య‌క్షుల ఎంపిక‌తో పాటు రాష్ట్ర పార్టీకి కూడా అధ్య‌క్షుడిని ఎంపిక చేసేందుకు పార్టీలోని నేత‌ల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ప‌దవీకాలం ముగిసినందున ఇప్ప‌టికే కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించాల్సి ఉంది.

ఇటీవ‌ల నాలుగు రాష్ట్రాల‌కు కొత్త‌గా అధ్య‌క్షుల‌ను నియ‌మించినా తెలుగు రాష్ట్రాల‌కు మాత్రం నియ‌మించ‌లేదు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధ్య‌క్షుల ఎంపిక‌పై నేత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం రాక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. అయితే, ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ వ‌చ్చేసింద‌ని బీజేపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నెలాఖ‌రులోగా ఏ క్ష‌ణాన్నైనా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని బీజేపీ సీనియ‌ర్ నేత చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్‌రావు కూడా ధ్రువీక‌రించారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర బీజేపీలో మార్పులు జ‌ర‌గనున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

అయితే, ఎవ‌రు కొత్త అధ్య‌క్షుడు కాబోతున్నార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సుమారు 10 మంది నేత‌లు బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి అవ‌కాశాలు ఉన్నందున నేత‌లు ఈ ప‌ద‌వి తీసుకునేందుకు ఎక్కువ‌గా ఉత్సాహం చూపిస్తున్నారు. ముందునుంచీ బీజేపీలో కొన‌సాగుతున్న పాత నేత‌ల‌తో పాటు ఇటీవ‌ల చేరిన కొత్త నేత‌లు కూడా రాష్ట్ర బీజేపీ ప‌గ్గాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఎంపీలు బండి సంజ‌య్‌, ధ‌ర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్సీ రామ‌చందర్‌రావు, ర‌ఘునంద‌న్‌రావుతో పాటు ఇటీవ‌ల పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ‌, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ పడ్డారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసి తిరిగి బీజేపీలో చేరిన విద్యాసాగ‌ర్‌రావు పేరు కూడా వినిపించినా ఆయ‌న ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. అంద‌రి పేర్ల‌నూ ప‌రిశీలించిన బీజేపీ అధిష్ఠానం ఇప్పుడు ఒక స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

కొత్త‌గా పార్టీలో చేరిన వారికి ఇప్పుడే అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని, పార్టీని న‌మ్ముకొని ప‌ని చేస్తున్న వారికి అన్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. దీంతో కొత్త వారికి ఈసారి అధ్య‌క్ష బాధ్య‌త‌లు వ‌ద్ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో డీకే అరుణ‌, జితేంద‌ర్ రెడ్డికు అవ‌కాశాలు లేకుండా పోయాయి. ఇక‌, ర‌ఘునంద‌న్ రావుపై ఇటీవ‌ల వ‌చ్చిన లైంగిక వేదింపుల ఆరోప‌ణ‌లు మైన‌స్‌గా మారాయి. దీంతో ఆయ‌న‌కు కూడా ఈ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు దాదాపు లేవు.

రామ‌చంద‌ర్‌రావు పార్టీ ప‌ట్ల నిబ‌ద్ధ‌త క‌లిగిన నేత అయినా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా గుర్తింపు లేదు. చివ‌ర‌గా ఎంపీలు బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్ మ‌ధ్యే పోటీ ఉంద‌ని తెలుస్తోంది. బీజేపీ పెద్ద‌ల్లో చాలా మంది, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ముందు నుంచీ పార్టీలో ఉన్న బండి సంజ‌య్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ త‌న‌ను మ‌రోసారి కొన‌సాగించాల‌ని అధిష్ఠానాన్ని కోరార‌ని తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలోని కొంద‌రు సీనియ‌ర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో ల‌క్ష్మ‌ణ్‌ను మ‌రోసారి కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఒక‌వేళ కొత్త వారికి అవ‌కాశం ఇస్తే బండి సంజ‌య్‌కు ఛాన్స్ ద‌క్కొచ్చ‌ని తెలుస్తోంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle