newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ‌ర‌ణాల సంఖ్య దాస్తున్నారా..? తెలంగాణ‌లో ఏం జరుగుతోంది..?

28-07-202028-07-2020 07:57:37 IST
Updated On 28-07-2020 08:13:21 ISTUpdated On 28-07-20202020-07-28T02:27:37.505Z28-07-2020 2020-07-28T02:27:17.541Z - 2020-07-28T02:43:21.766Z - 28-07-2020

మ‌ర‌ణాల సంఖ్య దాస్తున్నారా..? తెలంగాణ‌లో ఏం జరుగుతోంది..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా వైర‌స్ ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి ప‌ట్ల పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మీడియా, ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి. వైర‌స్ ప్రారంభమైన మొదట్లో ప్ర‌భుత్వం స్పందించిన తీరుకు, ఇప్పుడు ప్ర‌భుత్వం తీరుకు చాలా తేడా క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌దుల సంఖ్య‌లో కేసులు ఉన్న‌ప్పుడు వారికి ఒక‌రోజు మీడియాతో మాట్లాడే ముఖ్య‌మంత్రి ఇప్పుడు ఆ ప‌ని చేయ‌డం లేదు. అన్నింటికీ మించి క‌రోనా లెక్క‌ల‌పై, చేస్తున్న ప‌రీక్ష‌ల‌పై, మ‌ర‌ణాల సంఖ్య‌పై ప్ర‌తిప‌క్షాలు, మీడియా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తోంది. అయితే, వీటికి ప్ర‌భుత్వం వైపు నుంచి స‌రైన బ‌దులు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

దేశంలో క‌రోనా మ‌ర‌ణాల శాతం 2.13గా ఉంద‌ని తెలంగాణ‌లో 0.86 మాత్ర‌మేన‌ని తెలంగాణ ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్‌లో చెబుతుంది. ఇది తెలంగాణ స‌మాజానికి సంతోష‌క‌ర‌మైన వార్త‌. మ‌ర‌ణాల శాతం త‌క్కువ‌గా ఉండ‌టం ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తుంది. అయితే, ఈ లెక్క‌లు నిజ‌మేనా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏ రోజు రాష్ట్రంలో 10కి మించి క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేద‌ని ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్నాయి.

కానీ, వాస్త‌వం మాత్రం వేరే ఉంద‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు, మీడియాలో కొన్ని వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌భుత్వం చెబుతున్న క‌రోనా మ‌ర‌ణాల కంటే చాలా ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ‌మైన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు వెంక‌ట్ బ‌ల్మూరి ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈఎస్ఐ స్మ‌శాన వాటిక‌లో చీక‌టిప‌డిన వేళ ప‌దుల సంఖ్య‌లో మృత‌దేహాల అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న‌ట్లుగా ఆ వీడియో ఉంది. ఇవ‌న్నీ క‌రోనా మ‌ర‌ణాలే అని ఆయ‌న ఆరోపించారు. స‌హ‌జంగా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం చీకటి ప‌డ్డాక అంత్య‌క్రియ‌లు చేయ‌రు. కానీ, చీక‌టి ప‌డ్డాక‌, బంధువులు ఎవ‌రూ లేకుండా అంత్య‌క్రియ‌లు జ‌రుపుతున్నార‌ని, ప్ర‌భుత్వం చెబుతున్న దాని కంటే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నార‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి మెయిన్‌స్ట్రీమ్ మీడియాను కూడా అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో ఈఎస్ఐ స్మ‌శాన వాటిక వ‌ద్ద రోజంతా ప‌రిశీలించిన రెండు ప‌త్రిక‌లు వెంక‌ట్ బ‌ల్మూరి చేసిన ఆరోప‌ణ‌ల‌ను నిజమే అనేలా వార్త‌లు ప్ర‌చురించాయి. ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల కంటే చాలా ఎక్కువ క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయ‌ని మీడియా కూడా చెబుతోంది. కేవ‌లం హైద‌రాబాద్ ఈఎస్ఐ స్మ‌శాన వాటిక‌లో అంత‌మంది అంత్య‌క్రియ‌లు జ‌రుగుతుంటే రాష్ట్రంలో మిగ‌తా చోట్ల ఎంత మందివి జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

అయితే, ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ వీడియోల‌పై, వార్త‌ల‌పై ఎటువంటి వివ‌ర‌ణ రావ‌డం లేదు. ఏవైనా ఇత‌ర జ‌బ్బులు ఉన్న‌వారికి క‌రోనా సోకి మ‌ర‌ణిస్తే అవి క‌రోనా మ‌ర‌ణాల కింద‌కు రాదు అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ అంటున్నారు. అయితే, మ‌న స‌మాజంలో బీపీ, మ‌ధుమేహం వంటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు సగానికి పైగా జ‌నాభాకు ఉన్నాయి.

అంటే ఇటువంటి ఏ అనారోగ్య స‌మ‌స్య ఉన్నా, వారికి క‌రోనా సోకి మ‌ర‌ణిస్తే అది క‌రోనా మ‌ర‌ణం కాద‌నే వాద‌న కొంత వింత‌గానే అనిపిస్తోంది. మూడు, నాలుగు రోజులుగా తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌ల‌ను స‌రిగ్గా చేప‌ట్ట‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

మొద‌టి నుంచి తెలంగాణలో క‌రోనా విష‌యంలో కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఉంది. మొద‌ట్లో టెస్టులు చాలా త‌క్కువ చేశారు. హైకోర్టు ప‌దేప‌దే ఆదేశాలు ఇస్తే టెస్టుల సంఖ్య పెంచారు. ఇప్ప‌టికీ ప‌క్క రాష్ట్రాల‌తో చూస్తే తెలంగాణ‌లోనే క‌రోనా టెస్టుల సంఖ్య త‌క్కువ‌గానే ఉంది. అనుమానం ఉన్న వారు వెళ్లి వెంట‌నే టెస్టులు చేయించుకునే ప‌రిస్థితి రాష్ట్రంలో క‌నిపించ‌డం లేదు. 

ఇంత‌కుముందు జిల్లాల్లో క‌రోనా బులెటిన్లు విడుద‌ల అయ్యేవి. ఇప్పుడు విడుద‌ల చేయ‌డం లేదు. మొత్తంగా ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తే క‌రోనా ప్ర‌భావం మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే తెలంగాణ‌లో త‌క్కువ‌గానే ఉంది. అయితే, లెక్క‌లు త‌ప్పు అంటూ ఆరోపిస్తున్న‌ ప్ర‌తిప‌క్షాలు, మీడియాకు స‌రైన స‌మాధానం ఇచ్చి, ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సి బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle