newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

మ‌రో ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్న కేసీఆర్..!

26-12-201926-12-2019 08:45:05 IST
Updated On 26-12-2019 10:24:53 ISTUpdated On 26-12-20192019-12-26T03:15:05.909Z26-12-2019 2019-12-26T03:14:42.956Z - 2019-12-26T04:54:53.618Z - 26-12-2019

మ‌రో ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్న కేసీఆర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా అన్ని పార్టీల‌ను కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ వేదిక‌గా బీజేపీపై పోరు మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వ‌చ్చే నెల 22 నుంచి 30వ తేదీ మ‌ధ్య‌లో పెరేడ్ గ్రౌండ్ వేదిక‌గా ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌బోతున్నారు.

ఇటీవ‌లి వ‌ర‌కు బీజేపీతో టీఆర్ఎస్‌కు స‌ఖ్య‌త బాగానే ఉండేది. రాష్ట్రంలో ఎంఐఎంతో మంచి సంబంధాల‌ను నెరపుతూనే కేంద్రంలో బీజేపీకి స‌హ‌క‌రిస్తూ వ‌చ్చింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ గ‌ట్టి స‌వాల్ విసిరింది. ఇంకా బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో స‌హ‌కారం అంద‌డం లేద‌నే భావ‌న టీఆర్ఎస్‌లో నెల‌కొంది. దీంతో రెండు పార్టీల మ‌ధ్య దూరం పెరిగింది.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా బీజేపీకి దూర‌మైన‌ట్లు టీఆర్ఎస్ స్ప‌ష్టం చేసేసింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా బీజేపీ వ్య‌తిరేక ప‌క్షాల గ‌ళం విప్పుతున్నా కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న మౌనం వీడాల‌ని, బీజేపీతో పోరుకు సిద్ధం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఎన్ఆర్‌సీ అమ‌లులో తొలి అడుగుగా ముస్లిం సంస్థ‌లు ఆరోపిస్తున్న ఎన్‌పీఆర్‌ను తెలంగాణ‌లో నిలిపివేయాల‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ నేతృత్వంలోని ముస్లిం ప్ర‌తినిధి బృందం కేసీఆర్‌ను కోరింది.

ఈ స‌మావేశంలో దేశంలోని ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. కేసీఆర్ తానే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని, ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా, బీజేపీ వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ నిర‌స‌న చేప‌ట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

హైద‌రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌బోయే ఈ స‌భ‌కు కాంగ్రెస్ స‌హా బీజేపీ వ్య‌తిరేక పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే పశ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడులో స్టాలిన్ ఆధ్వ‌ర్యంలో ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా ర్యాలీలు, భారీ స‌భ‌లు జ‌రిగాయి. తెలంగాణ‌లో కేసీఆర్ నేతృత్వంలోనే ఆందోళ‌న జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక‌, శుక్ర‌వారం నిజామాబాద్‌లో ఎంఐఎం ఆధ్వ‌ర్యంలో సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ త‌ర‌పున ఈ స‌భ‌కు మంత్రుల‌ను పంపించ‌నున్న‌ట్లు తెలిపారు.

ఇక‌, కాంగ్రెస్‌ను కూడా ఈ స‌భ‌కు ఆహ్వానించాల‌ని అస‌దుద్దిన్ ఓవైసీ నిర్ణ‌యించారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ఆయ‌న ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌నున్నారు. ఇదే జ‌రిగితే బీజేపీకి వ్య‌తిరేకంగా తెలంగాణ‌లో మూడు ప్ర‌ధాన పార్టీలు ఒక వేదిక‌ను పంచుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   7 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   8 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   9 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   10 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle