newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

17-02-202017-02-2020 13:50:16 IST
2020-02-17T08:20:16.864Z17-02-2020 2020-02-17T08:20:14.082Z - - 15-04-2021

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్వేష రాజకీయాలను పెంచి పోషిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని జీవితం చివరివరకు తమ పిల్లలకు నేర్పుతూనే ఉంటామని మజ్లిస్ అధినేత అసదుద్దీని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘25 ఏళ్లుగా రాజకీయ జీవితంలో వ్యక్తిగత  భద్రత అనేది ఏమాత్రం లేకుండానే తిరుగుతున్నా. నన్ను చంపాలనుకుంటే చంపేయండి కానీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా స్పందిస్తూనే ఉంటాను’ అంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని నరేంద్రమోదీ దేవుడు కాదని, ఆయన విధానాలను వ్యతిరేకించడం భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఒవైసీ పేర్కొన్నారు. మైనారిటీలు నిత్యం భయాందోళనలతో బతికేలా మోదీ వరుసగా విధానాలను రూపొందిస్తూ వస్తున్నారని ప్రజలను నిలువునా చీల్చివేస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే జైలుకు పంపుతారంటే తాము జైళ్లను నింపడానికైనా సిద్ధపడతామని ఒవైసీ హెచ్చరించారు.

కర్ణాటకలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలపై నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నా చెప్పుతో సమానం’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉండాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఆయన అన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపినా సంతోషంగా వెళ్తామని అన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది మంది తీవ్రంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా సంచలనం రేకెత్తించాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle