మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?
31-05-202031-05-2020 08:55:15 IST
Updated On 31-05-2020 10:58:54 ISTUpdated On 31-05-20202020-05-31T03:25:15.109Z31-05-2020 2020-05-31T03:21:19.456Z - 2020-05-31T05:28:54.991Z - 31-05-2020

మే 31తో నాలుగవ విడత లాక్ డౌన్ ముగుస్తోంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్డౌన్ నాలుగవ దశ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఐదవదశ లాక్డౌన్ కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది.అయితే తెలంగాణ ప్రభుత్వం వాటిని అమలు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ కానుంది. జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి ఇవ్వడంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇక జూలైలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం సూచించింది. ఆరోగ్యశాఖ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకువాలని అన్ని సంస్థలకు కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది. కర్ఫ్యూ సమయాన్ని కూడా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించింది కేంద్రం. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలను తెలంగాణలో ఏ మేరకు పాటించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రార్థన మందిరాలు, విద్యాసంస్థలు తెరవడంపై తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్ గా లేదు. గతంలో కేంద్రం ఇచ్చిన మినహాయింపుల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని విమర్శలు వస్తోన్న నేపధ్యంలో కేంద్రం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ఎంత మేరకు పాటిస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ తెలంగాణ ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను పాజిటివ్ కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న సమయం లో ఇచ్చింది. మళ్ళీ కేసులు పెరుగుతున్న పరిస్థితులలో రాష్ట్రంలో ఎప్పుడూ ఉన్న విధంగా సడలింపులు ఉంటాయా? కేంద్రం ఇచ్చిన సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది వేచి చూడాలి. దీనితో పాటు పాజిటివ్ కేసులు పెరుగుతోన్న కంటోన్మెంట్ ప్రాంతాలలో కఠినంగా వ్యవహారించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా